Tollywood: తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం సంక్షోభంలో ఉందని చెప్పాలి. గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదో ఒక వివాదం ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. గత కొద్దిరోజుల క్రితం థియేటర్లకు బంద్ ప్రకటించాలి అంటూ పిలుపునివ్వడంతో ఈ విషయం కాస్త సంచలనగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన మర్చిపోకముందే మరోసారి షూటింగ్స్ బంద్ కు పిలుపునిచ్చారు. రేపటి నుంచి సినిమాల షూటింగ్స్ జరగకూడదు అంటూ తెలుగు ఫిలిం ఫెడరేషన్ (Telugu Film Fedaration)పిలుపునివ్వడంతో నిర్మాతలు అయోమయంలో పడ్డారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా సెట్స్ పై ఉన్నాయి.
30% వేతనాలు పెంచాల్సిందే…
ఇలాంటి తరుణంలోనే బంద్ కు పిలుపునివ్వడంతో ఇది కాస్త ఇండస్ట్రీలో చర్చలకు కారణమైంది. ఇలా బందుకు పిలుపునివ్వడమే కాకుండా కొన్ని డిమాండ్లను కూడా వ్యక్తం చేశారు 30% వేతనాలు పెంచితేనే షూటింగ్స్ లో పాల్గొంటామంటూ ఫిలిం ఫెడరేషన్ తెలిపింది. గత కొంతకాలంగా సరైన వేతనాలు ఇవ్వకపోవడంతోనే తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. వేతనాల విషయంలో గత కొద్దిరోజులుగా తెలుగు కార్మిక సంఘం ఫెడరేషన్ అలాగే ఫిలిం ఛాంబర్(Film Chamber) మధ్య తరచూ వివాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
మూడేళ్లు దాటిన పెరగని జీతాలు…
కార్మిక సంఘం ఫెడరేషన్ వారికి ప్రతి ఏడాది జీతాలు పెంచకపోయిన ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జీతాలు(Salary) పెంచాలని తెలిపారు.. ఇప్పటికే మూడు సంవత్సరాలు దాటిపోయిన తమ జీతాల పెంపుదల గురించి ఫిలిం ఛాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకొని నేపథ్యంలోనే బంద్ కు పిలుపునిచ్చినట్టు తెలిపారు. ఇలా వేతనాల పెంపు విషయంలో ఫిలిం ఛాంబర్ తో పలు ఫెడరేషన్ సంప్రదింపులు జరిపిన ఫిలిం చాంబర్ మాత్రం వీరు కోరినట్టు 30% జీతాలు పెంచలేమని తెలియజేశారు. ఇలా వారి కోరిన విధంగా జీతాలు పెంచని నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
నిర్మాతల నిర్ణయం ఏంటి?
ఇక జీతభత్యాల పెంపుదల విషయంలో ఈరోజు సమావేశమైన తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. తమకు ఎప్పుడైతే 30% జీతాలు పెంచుతారో అప్పుడే షూటింగ్స్ లో పాల్గొంటామని డిమాండ్లు చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఇండస్ట్రీలో అలజడి నెలకొంది. మరి ఈ విషయంపై నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? వారు డిమాండ్ చేసిన విధంగానే 30 శాతం జీతాలు పెంచుతారా? ఏంటి అనేది తెలియాల్సింది. ఇక కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా హైదరాబాదులో ఇతర భాష సినిమాలు ఏవైతే షూటింగ్స్ జరుపుకుంటున్నాయో అవి కూడా షూటింగ్ జరుపుకోవడానికి వీలులేదని తెలిపారు. ఇక రేపు సినిమాలో షూటింగ్ ఆగిపోవడమే కాకుండా, అల్లరి నరేష్ (Allari Naresh)హీరోగా రేపు కొత్త సినిమా పూజ కార్యక్రమాలు కూడా జరుపుకోవాల్సి ఉంది అయితే ఈ పూజా కార్యక్రమాలు కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది.
Also Read: Geetha Sing: కొడుకు మరణం ఎమోషనల్ అయిన నటి… బాడీ షేమింగ్ తప్ప లేదంటూ!