Geetha Singh: గీతా సింగ్(Geetha Singh) తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. అల్లరి నరేష్ (Allari Naresh)హీరోగా నటించిన కితకితలు(Kithakithalu) సినిమాతో ఎంతో ఫేమస్ అయిన గీతా సింగ్ ఇటీవల సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారని చెప్పాలి. అయితే తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా గీతా సింగ్ తన సినిమాలు గురించి అలాగే, తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని చేదు సంఘటనల గురించి ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. అల్లరి నరేష్ హీరోగా ఇవివి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కితకితలు సినిమాలో హీరోయిన్గా ఈమె నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో గీత సింగ్ చాలా శరీర బరువుతో కనిపించారు. ఈ సినిమా కోసం తాను దాదాపు నాలుగు నెలల పాటు పెద్ద ఎత్తున ఫుడ్ తీసుకుంటూ సహజంగానే లావు అయ్యానని తెలిపారు.
రూ. 9 కోట్ల కలెక్షన్లు..
ఈ సినిమా తర్వాత చాలామంది నా నటనను ప్రశంసించినప్పటికి కొంతమంది మాత్రం బాడీ షేమింగ్(Body Shaming) కామెంట్స్ చేశారని తెలిపారు. ఇలాంటి కామెంట్స్ నన్ను చాలా బాధపెట్టాయి కానీ సినిమాకు మంచి పేరు రావడంతో చాలా సంతోషపడ్డానని తెలిపారు. ఈ సినిమా సమయంలో డైరెక్టర్ గారు తన ఆస్తులను తాకట్టు పెట్టి సినిమా చేశారు. అప్పట్లో ఈ సినిమాకు 60 లక్షల బడ్జెట్ పెడితే ఏకంగా 9 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టిందని గీత సింగ్ కితకితలు సినిమా కలెక్షన్ల గురించి తెలిపారు.
ప్రమాదంలో కొడుకు మరణం…
ఇలా ఈ సినిమా ద్వారా ఎంతోమంది నా నటనకు ప్రశంసలు కురిపించారని తెలిపారు. అయితే అప్పుడు పెరిగిన శరీర బరువు తగ్గడానికి చాలా కష్టపడ్డానని తెలిపారు. ఇక గీత సింగ్ తన జీవితంలో ఇప్పటికీ కూడా ఒంటరిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈమె పెళ్లి చేసుకోనప్పటికీ ఒక బాబును దత్తత తీసుకొని బాబు బాధ్యతలను ఈమె చూసుకున్నారు అయితే తను పెరిగి పెద్దయిన తర్వాత రోడ్డు ప్రమాదంలో మరణించారని ఈ సందర్భంగా కొడుకు మరణం(Son Death) గురించి తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. తన స్నేహితుడితో పాటు బైక్ లో వెళ్లడంతో ప్రమాదం జరిగిందని ఈ విషయం తెలిసిన నేను అక్కడికి వెళ్ళగానే తన స్నేహితుడిని చూసి స్పృహ తప్పి పడిపోయానని తెలిపారు.
చివరి చూపు కూడా లేదు…
తన అంబులెన్స్ ముందు వెళ్తుంటే నన్ను హాస్పిటల్ కి తీసుకొని వెనుక వెళ్లారని నాకు మెలకువ వచ్చేసరికి బాబుకి పోస్ట్ మార్టం జరుగుతుందని తనని చివరి చూపు కూడా చూడలేదు అంటూ ఈ సందర్భంగా గీతా సింగ్ తన కొడుకు మరణం గురించి తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. తన సర్వస్వం మొత్తం బాబు అనుకుని బ్రతికాను కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు అంటూ ఈమె తెలిపారు. ఇక తాను ఇండస్ట్రీలో సంపాదించింది మొత్తం తన అనుకున్న వారికి పెట్టి మోసపోయాననీ, కుటుంబ సభ్యులు బంధువులు తనను దూరం పెట్టిన ఎంతోమంది స్నేహితులు తనకు కష్ట కాలంలో అండగా నిలిచారు అంటూ ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలు గురించి కూడా గీతా సింగ్ ఈ సందర్భంగా అందరితో పంచుకున్నారు. ఇక ప్రస్తుతం తనకు సినిమా అవకాశాలు రాకపోవడంతోనే దూరంగా ఉన్నానని అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని తెలిపారు.
Also Read: Satya Dev: అవసరమైతే పొలం పనులు చేస్తా.. ఆ పని మాత్రం అస్సలు చేయను!