Megastar Chiranjeevi: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజీ ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నాలుగు దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఫిలిం ఇండస్ట్రీని శాసిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్ కి దీటుగా మెగాస్టార్ చిరంజీవి ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు.
అందరు హీరోలు కేవలం ఒక్క సినిమాకు మాత్రమే పరిమితం అయిపోతే చిరంజీవి మాత్రం రెండు మూడు సినిమాలను లైన్లో పెట్టారు. మెగాస్టార్ నటించిన విశ్వంభర సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. విశ్వంభర సినిమా తరువాత సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా విడుదల కానుంది.
సీఎం కలిసిన చిరంజీవి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను మెగాస్టార్ చిరంజీవి సీఎం నివాసానికి వెళ్లి కలిశారు. ఈ ఆత్మీయ సమావేశానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వారిద్దరి మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం ఏ అంశం గురించి మాట్లాడడానికి చిరంజీవి కలిశారో క్లారిటీ లేదు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చిరంజీవి గురించి పలు ప్రశంసలు విసిరారు. ఈ కలయికకి ఉద్దేశం ఏంటో త్వరలో తెలియాల్సి ఉంది.
Also Read: OG Single : ఓ జి సాంగ్ లో మైండ్ చెదిరిపోయే డీటెయిల్స్, ఇది సుజిత్ అంటే