Tollywood strike: నిన్నటి వరకు తెలుగు సినిమా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. సినిమా కార్మికులు (Telugu film workers) తమ వేతనాలు 30% వరకు పెంచాలి అంటూ డిమాండ్ చేశారు. ఇప్పటికే చాలా ఎక్కువగా ఇస్తున్నాము ఇప్పటికిప్పుడు 30 శాతం పెంచాలి అంటే మా వల్ల కుదరని పని అని మరోవైపు నిర్మాతలు (Telugu film producers) తమ ఉద్దేశం తెలిపారు.
ఇది రెండు మూడు రోజుల్లో తేలిపోద్ది అనుకున్నారు. కానీ ఈ వ్యవహారం ఏకంగా 17 రోజులు నడిచింది. షూటింగులు కూడా జరగకుండా ఆపేశారు. షూటింగ్ కు వెళ్లిన వాళ్ల మీద యూనియన్ సెక్రెటరీ వెళ్లి దాడి చేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైర్లు అయ్యాయి. మొత్తానికి రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యకు పరిష్కారం చూపించారు. కానీ ఇప్పుడు మరో సమస్య ఎదురయింది.
ఏం చేయాలో తెలియని పరిస్థితి
ఉన్నపలంగా షూటింగ్ లు అన్నీ ఆగిపోవడం వలన యాక్టర్ లు అందరూ ఖాళీ అయిపోయారు. కొంతమంది పెద్ద హీరోలు అయితే కొత్త దర్శకులు కథలను విన్నారు. కొంతమంది దర్శకులు వాళ్ళ కథలను డెవలప్ చేసుకున్నారు. కానీ కొంతమంది ఆర్టిస్టులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఒకేసారి అన్ని షూటింగ్ లో మొదలు కావడం వలన ఏ సినిమాకి డేట్స్ ఇవ్వాలో తెలియని పరిస్థితిలో కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. ఒకరికి ఇచ్చి ఒకరిని వెనక పెడితే ఆ సినిమాకు నష్టం కలుగుతుంది. ఆయా సినిమాలు కూడా రిలీజ్ డేట్ లో ఫిక్స్ చేసుకొని ఉంటాయి. ఆ రిలీజ్ డేట్ కు సినిమా అందించాలి అంటే సరైన టైం కి అనుకున్న యాక్టర్ తో షూటింగ్ జరగాలి. అది జరగకపోతే సినిమా వాయిదా తప్పదు.
అందరికీ ఒకేసారి కావాలంటే కుదరదు
ఒక ఆర్టిస్ట్ తో ముడిపడిన సీన్స్ చాలా సినిమాల్లో ఉంటాయి. అయితే అదే ఆర్టిస్ట్ ఆ పాత్రకు న్యాయం చేస్తాడు అనుకుంటే అతని కోసం ఆగాలి. లేదంటే ఇంకో ఆర్టిస్టు ను తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. ఒక ఆర్టిస్టు ను సినిమా కోసం తీసుకొని తనతో కొన్ని సీన్స్ షూటింగ్ చేసి, ఇంకొన్ని సీన్స్ పెండింగ్ లో ఉంటే ఖచ్చితంగా అదే ఆర్టిస్ట్ తో చేయాలి. అతను డేట్స్ ఇచ్చినంత వరకు ఎదురు చూడాలి. ఇలా ప్రస్తుతం చాలా సినిమాల విషయాల్లో ఆర్టిస్టులు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. రేపటినుండి కొన్ని సినిమాలు సెట్స్ మీదకి వెళ్ళనున్నాయి. వీటిలో పెద్ద సినిమాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.
Also Read: SSMB29 : SSMB29 రిలీజ్ డేట్ ఫిక్స్, మహేష్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి