Tollywood Villain: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ ఈమధ్య సినిమాలలో నటించడంతో పాటుగా సినిమాలలో నిర్మిస్తున్నారు. ఎంతోమంది స్టార్స్ ఇప్పటికే సినిమాలను తమ సొంతదానంలో నిర్మిస్తూ వరుస హిట్లను తమ ఖాతాలో వేసుకుంటున్నారు.. తాజాగా మరో తెలుగు విలన్ నిర్మాతగా మారిపోతున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. ఈయన హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులు మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను అకౌంట్ లో వేసుకుంటున్నాడు. ఆయన మరి ఎవరో కాదు టాలీవుడ్ లెజెండ్ యాక్టర్ జగపతిబాబు.. ఈయన నిర్మాతగా మారబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? సినిమా గురించి పూర్తి వివరాల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతలుగా కొనసాగుతున్న వారి పిల్లలు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు తప్ప నిర్మాతలగా మాత్రం ఎవరు చేయడం లేదు. సినిమాలు ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోలేము అనో.. లేదా నష్టాలు వస్తే భర్తీ చేయడం కష్టమని అనుకున్నారో ఏమో తెలియదు కానీ చాలామంది హీరోలుగా మాత్రమే ఎంట్రీ ఇస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో లెజెండరీ ప్రొడ్యూసర్ రాజేంద్రప్రసాద్ కుమారుడు జగపతిబాబు కూడా హీరో గానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రత్యేక పాత్రలోనూ.. విలన్ గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఆయన హీరోగా ఎదిగే క్రమంలో తండ్రి నిర్మించిన సినిమాల్లో నటించాడు తప్ప.. సొంతంగా మాత్రం ప్రొడక్షన్ చేయలేదు.. అప్పట్లో నిర్మాతగా తాను సరిపోనని అనుకున్నారేమో.. కానీ ఇప్పుడు మాత్రం నిర్మాతగా సినిమాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : అత్తింటికి వల్లి దూరం.. భద్రతో భాగ్యం చేతులు కలుపుతుందా?.. మరో ట్విస్ట్ రెడీ..
చిన్న సినిమా గా థియేటర్లలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీ లిటిల్ హార్ట్స్.. ఈ మూవీలో హీరో నాన్న క్యారెక్టర్ లో రాజీవ్ కనకాల అద్భుతంగా నటించారు.. అయితే ముందుగా ఈ పాత్రకు లెజెండరీ యాక్టర్ జగపతిబాబును సంప్రదించినట్లు తెలుస్తుంది. అయితే ఆయన బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి తప్పుకున్నారట. తర్వాత ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంలోనే డైరెక్టర్ కి ఫోన్ చేసి తాను ఓ నిర్మాతగా సినిమా చేయాలనుకుంటున్నాను మీరే డైరెక్టర్ గా ఉండాలని చెప్పినట్లు మార్తాండ ఓ సందర్భంలో బయటపెట్టారు. తాను ఓకే చెప్పానని మార్తాండ్ వెల్లడించాడు. ప్రస్తుతానికి తనకున్న కమిట్మెంట్ ఆ సినిమానే అని సాయి మార్తాండ్ తెలిపాడు. అసలు ప్రొడక్షనే వద్దనుకున్న జగ్గు భాయ్ ఇన్నాళ్లకు మళ్లీ నిర్మాతగా మారాలని అనుకోవడం మామూలు విషయం కాదు. మరి ఈ వార్త కనుక నిజమైతే ఇండస్ట్రీలోకి మరో నిర్మాత వచ్చినట్లే.. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం జగపతిబాబు సినిమాల విషయానికొస్తే.. భారీ ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తెలుగు మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా ఈయన సినిమాలు చేస్తూ వస్తున్నారు.