Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో… తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచిస్తుంది. రేపు మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
ఇవాళ నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, జగిత్యాల, జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ఈ జిల్లాలకు ఆరెంజ్ ఆలర్ట్ జారీ చేసింది. వర్షాల ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, ములుగు, నాగర్ కర్నూల్ సహా మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఏపీలోని 14 జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు..
ఏపీలో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలతో పాటు.. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు.. కాకినాడ, అంబ్కేదర్ కోనసీమ, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపింది.
వర్షాల కారణంగా జాతీయ రహదారులపై నలిపివేత..
హనుమకొండ జిల్లాలో కురిసిన వర్షాలకు చెరువులన్నీ నిండుకుండలా మారాయి. ఆత్మకూరు మండలం కటాక్షాపూర్ శివారులో జాతీయ రహదారిపై అలుగుపారడంతో.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో అత్యధికంగా 22 సెంటీమీటర్లు, ములుగు జిల్లా మల్లంపల్లిలో 21.7, కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Also Read: అల్లర్ల తర్వాత తొలిసారి మణిపూర్‌కు మోదీ.. ఏం జరుగబోతోంది?
భారీ వర్షాలకు పొంగిపోర్లుతున్న వాగులు, వంకలు..
భారీ వర్షాలకు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సోమారం గ్రామంలోని మోడల్ స్కూల్ ముంపునకు గురైంది. దీంతో పాఠశాల వసతి గృహంలో ఉన్న విద్యార్థులు, సిబ్బంది అక్కడి నుంచి బయటికి వచ్చేశారు. ఇక, హైదరాబాద్‌లో రెండ్రోజులుగా కురిసిన వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కురిసిన వర్షాలకు మానేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పెద్దపల్లి జిల్లాలో ఓడేడు వంతెన వద్ద మానేరు ప్రవాహం ఒక్కసారి పెరిగిపోగా.. ఇసుక తరలించేందుకు వచ్చిన 4ట్రాక్టర్లు చిక్కుకుపోయాయి.