 
					Baahubali: The Epic Review : ఇప్పటితరం ప్రేక్షకులు తెలుగు సినిమా గురించి బాహుబలికి ముందు, ఆ తర్వాత అని చెప్పుకుంటారు. ఈ మూవీతో రాజమౌళి తెలుగు సినిమా దమ్మును ప్రపంచానికి చాటి చెప్పారు. అలాగే టాలీవుడ్ సినిమా ల్యాండ్ స్కేప్ ను మార్చిన ఘనత ఈ మూవీదే. అలాంటి సినిమాను రిలీజైన దాదాపు పదేళ్ల తర్వాత రీ రిలీజ్, అది కూడా రెండు భాగాలుగా కాకుండా ఒకే భాగం “బాహుబలి ది ఎపిక్ ” పేరుతో 3 గంటల 45 సినిమాల సినిమాగా తీర్చిదిద్ది, ప్రేక్షకులకు మరోసారి కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఎక్స్పరిమెంట్ చేశారు రాజమౌళి. మరి ఆ ప్రయత్నం ప్రేక్షకులకు నచ్చిందా ? అనేది రివ్యూలో చూద్దాం…
భల్లాలదేవుడు మాహిష్మతి సింహాసనం మీద ఆశతో కుట్రలు, కుతంత్రాలు పన్ని… బాహుబలిని తప్పించే ప్రయత్నం చేస్తాడు. దానికి కట్టుబానిస కట్టప్ప, తల్లి – రాజమాత శివగామి సాయం తీసుకుంటాడు. కొడుకుపై ప్రేమతో, పరిస్థితుల రీత్యా ఆమె తీసుకోకూడని నిర్ణయం తీసుకుంటుంది. ఫలితంగా మాహిష్మతి సామ్రాజ్యం వినాశనం మొదలవుతుంది. కట్టప్ప చేతిలో బాహుబలి వెన్నుపోటుకు గురై చనిపోతే, మరోవైపు ఆయన భార్య దేవసేనను భల్లాలదేవ బానిసగా చేసుకుంటాడు. నిజం తెలుసుకున్న శివగామి బాహుబలి కొడుకు, పసికూన అమరేంద్ర బాహుబలిని తీసుకుని తప్పించుకుంటుంది. అమరేంద్ర బాహుబలిని ఆ ప్రమాదం నుంచి గట్టెక్కించి ఆమె కన్నుమూస్తుంది. కొన్నేళ్ల తర్వాత పెరిగి పెద్దవాడైన అమరేంద్ర బాహుబలి తన తండ్రి చావుకు భల్లాల దేవుడి మీద ప్రతీకారం తీర్చుకుంటాడు. అందరికీ తెలిసిన ఈ కథలో ఏ సీన్స్ కట్ చేశారు ? యాడ్ చేసిన సీన్స్ ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.
2015 జూలై 10 న బాహుబలి మొదటి భాగం విడుదలై, టాలీవుడ్ ను షేక్ చేసింది. అంతకుమించి అన్నట్టుగా రెండేళ్ల తర్వాత పార్ట్ 2ను రిలీజ్ చేసి తిరుగులేని పాన్ ఇండియా డైరెక్టర్ గా మారారు జక్కన్న. టాలీవుడ్ తలరాతను తిరగరాసిన ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ అయ్యి పదేళ్లు గడుస్తున్నా ఇంకా ఆ క్రేజ్ తగ్గలేదు. థియేటర్ల దగ్గర నుంచి టీవీల వరకు ఈ సినిమా ప్రయాణం అన్ బీటబుల్ అన్నట్టుగా సాగింది.
ఇక పదేళ్ల అనంతరం, అక్టోబర్ 31న ”బాహుబలి ” రెండు భాగాలను కలిపి ఒకే మూవీగా ” బాహుబలి ది ఎపిక్” పేరుతో రిలీజ్ చేశారు మేకర్స్. 3 గంటల 45 నిమిషాల నిడివి ఉన్న సినిమా అంటే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టే. కానీ బాహుబలి విషయంలో మాత్రం మరోసారి మ్యాజిక్ జరిగింది. ఫస్టాఫ్ పరుగులు పెట్టినా కూడా కొంచం సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ సెకండాఫ్ లోనే ఉంది మ్యాజిక్ మొత్తం. యాక్షన్ నుంచి ఎమోషన్ దాకా పదేళ్ళ కిందటి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అయ్యి, గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
శివగామి పట్టుదల, దేవసేన అందం, బాహుబలిగా ప్రభాస్ రాజసం, రానా విలనిజం అద్భుతం. అయితే ఈసారి వీటన్నింటినీ మించి కీరవాణి మ్యూజిక్ హైలెట్ అయ్యింది. అలాగే సినిమా ఎడిటింగ్ లో రాజమౌళి అండ్ టీం ఎఫర్ట్స్ కనిపిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అప్డేటెడ్ విజువల్ ఎఫెక్ట్స్ తో మరో విజువల్ వండర్ ఎక్స్పీరియన్స్. కాకపోతే ప్రభాస్ తమన్నా సీన్స్, ” పచ్చబొట్టు” సాంగ్ తీసేయడంతో పాటు మరికొన్ని ఐకానిక్ సీన్స్, డైలాగ్స్ కట్ చేయడం నిరాశను కలిగిస్తుంది. తమన్నా కటింగ్ సీన్స్ ను స్వయంగా రాజమౌళి వాయిస్ ఓవర్ తో కవర్ చేశారు.
మొత్తానికి… థియేటర్లలో తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మరో రాజమౌళి మాస్టర్ పీస్ ‘బాహుబలి ది ఎపిక్ ‘.
VFX అప్‌గ్రేడ్ – మాహిష్మతి సెట్స్, జలపాతం సీన్, యుద్ధాలు ఇప్పటికీ అద్భుతం.
స్టోరీటెల్లింగ్
నటీనటులు
మ్యూజిక్, టెక్నికల్ యాస్పెక్ట్స్
లెంగ్త్
లాజిక్ లెస్ సీన్స్ (జలపాతం క్లైంబ్ లాంటి సీన్స్)
మనోహరి సాంగ్, కొన్ని సబ్-ప్లాట్స్ కట్ అవ్వడం
ఫీమేల్ క్యారెక్టర్స్ (దేవసేన, అవంతిక) డెప్త్ తక్కువ