BigTV English

Bigg Boss 9 : బిగ్ బాస్ హౌస్‌లో ఓవర్ యాక్షన్ గాళ్లు వీళ్లే.. బెస్ట్ ఎవరంటే?

Bigg Boss 9 : బిగ్ బాస్ హౌస్‌లో ఓవర్ యాక్షన్ గాళ్లు వీళ్లే.. బెస్ట్ ఎవరంటే?

Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతుంది. ఈ సీజన్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా తమ స్థాయిలో గేమ్ బానే ఆడుతున్నారు. కొద్దికొద్దిగా ఎవరెవరు ఎలాంటి వారు అని అంచనా వస్తుంది.


సిల్లీ ఆర్గ్యుమెంట్స్ సంజన

సంజన ఎక్కువ స్క్రీన్ స్పేస్ కోసం సిల్లీ మిస్టేక్స్ చేస్తూ ఎండ్లస్ ఆర్గుమెంట్స్ చేస్తుంది. మళ్లీ ఇన్నోసెంట్ గా మాట్లాడుతుంది. దీనికి అంత ఈజీగా ఒప్పుకోదు ఆర్గ్యుమెంట్ కొనసాగిస్తూనే ఉంది. ఎవరితో కూడా జెన్యూన్ గా మాట్లాడటం లేదు టాపిక్స్ చాలా ఈజీగా చేంజ్ చేస్తుంది. బిగ్బాస్ కూడా కన్ఫ్ఫెక్షన్ రూమ్ కి పిలిచి తనకు ఫేవర్ చేయడంతో తను ఇంకా ఎక్కువగా ఆర్గుమెంట్ చేయడం మొదలుపెట్టింది. తనతో ఎవరైతే మాట్లాడుతూ తెలివిగా ప్రశ్నిస్తున్నారు వాళ్లతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టింది. దమ్ము శ్రీజ, మనీష్, హరీష్ వీళ్ళతో మంచి ఫ్రెండ్షిప్ కొనసాగించే ప్రయత్నం చేస్తుంది. అందుకే కెప్టెన్సీ రూమ్ లోకి వచ్చే అవకాశం శ్రీజకు మరియు మనీష్ కు ఇచ్చింది.

అబద్దాల తనుజ 

బిగ్ బాస్ హౌస్ కి ఫస్ట్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది తనుజ. తన గురించి తొమ్మిది మాటల్లో చెప్పమంటే ఇన్నోసెంట్ ఇంటెలిజెంట్ అంటూ నాగార్జున ముందు ఏవేవో మాట్లాడింది. కానీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా ఈజీగా అబద్ధాలు ఆడడం మొదలు పెట్టేసింది. అది షో చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థం అయిపోద్ది.


డిమోన్ పవన్ 

కామనర్స్ లో డిమోన్ పవన్ పెద్దగా ఎవరికి అర్థం కావడం లేదు. ఇదే షో లో ఒకటే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నట్లు గేమ్ కూడా ఒకేలా ఆడుతున్నాడు. ముఖ్యంగా బహుశా బయట కుక్ ఏమో. అసలు మెచ్యూరిటీ లేదు, ప్రతి దాంట్లో దూరుతున్నాడు. సాంబార్ ఎలా చేయాలి, పచ్చడి ఎలా చేయాలి, గోంగూరలో ఏం వేయాలి అని కిచెన్ డ్యూటీ చేస్తున్న తనుజ కు సజెషన్స్ ఇస్తున్నాడు.

మాస్క్ మెన్ క్లెవర్ 

బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ మేట్స్ లో కొద్దో,గొప్పో కొంతమేరకు హరీష్ బెటర్ అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఆయన మాట్లాడే విధానం పర్ఫెక్ట్ గా ఉంటుంది. ముఖ్యంగా కిచెన్ కి వెళ్లి తను ఓన్ గా ప్రిపేర్ చేసుకొని తింటున్న టైంలో, బిగ్బాస్ కెప్టెన్ సంజనను అడిగారు మీ కెప్టెన్సీలో అతను కిచెన్ కి వెళ్లి వండుకొని తింటున్నాడు మీకు ఏమీ అనిపించట్లేదా అని. సంజన ఏమీ అనకముందే తింటున్న ప్లేట్ ను వెళ్లి కిచెన్ లో పెట్టేసి సంజనకు నా వల్ల మీకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పారు.

అర్థం కాని మనీష్ 

అగ్నిపరీక్ష షో ద్వారా కామనర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మనీష్ ను అగ్నిపరీక్షలో ఎందుకు ఎలివేషన్ ఇచ్చి లేపారు అర్థం కాలేదు. షో లో మాత్రం ఇతని గేమ్ అంతా ఆకట్టుకోలేదు. సంచాలక్ గా కూడా ఫెయిల్ అనేది కొంతమంది అభిప్రాయం.

ప్రతిదానికి అరుపులే శ్రీజ 

ఒక విషయం జరిగినప్పుడు దానిని చెప్పే విధానంలో కూడా చెప్పొచ్చు. దమ్ము శ్రీజ మాత్రం ప్రతి దానిలో ఇన్వాల్వ్ అయిపోయి ఊరికే అరుస్తూ ఉంటుంది. బిగ్బాస్ కెప్టెన్ ని సెలెక్ట్ చేసే అవకాశం మొదట సంజనాకు ఇచ్చినప్పుడు తను కొంతమంది పేర్లు చెప్పింది. అప్పుడు మేమెందుకు లేము అంటూ ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టింది. ఆశ్చర్యకరంగా దమ్ము శ్రీజని సపోర్టర్ గా ఉండి సంజనను కెప్టెన్ చేసింది. మొత్తానికి కామనర్స్ టీం ను ఓడించింది. ఈ పాయింట్ హరీష్ బాగా పట్టుకున్నాడు.

కూల్ సుమన్ శెట్టి 

సుమన్ శెట్టి గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలు తో మంచి గుర్తింపు సాధించుకున్నారు. ప్రస్తుతం హౌస్ లో కూడా తన గేమ్ తాను కూల్ గా ఆడుతున్నారు. అవసరమైన చోట అదిరిపోయే సెటైర్లు వేస్తున్నారు.

ఎంటర్టైనర్ ఇమ్మానుయేల్ 

జబర్దస్త్ షో తో మంచి గుర్తింపు సాధించుకున్న ఇమ్మానుయేల్ ఈ షోలో కూడా ఎంటర్టైన్ చేస్తున్నాడు. అలానే కొన్ని సందర్భాల్లో అతని మాట్లాడే విధానం విపరీతంగానే ఆకట్టుకుంటుంది. సమ్ టైమ్స్ అరవాల్సి వస్తే గట్టిగానే అరుస్తున్నాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సంచాలక్ తో జరిగిన గొడవ.

ముందు ముందు రోజుల్లో మిగతా క్యారెక్టర్స్ గురించి కూడా పూర్తిస్థాయిలో బయటపడుతుంది.

Also Read : Bigg Boss 9 : పర్మిషన్ లేకుండా ఫుడ్డు తిన్న హరీష్, రిస్క్ లో పడ్డ కెప్టెన్ సంజన

Related News

Bigg Boss 9 : పర్మిషన్ లేకుండా ఫుడ్డు తిన్న హరీష్, రిస్క్ లో పడ్డ కెప్టెన్ సంజన

Bigg Boss 9 : కంటెస్టెంట్స్ లెక్కలు తేల్చనున్న మంగపతి, శివాజీ గ్రాండ్ ఎంట్రీ

Bigg Boss 9: ఇలా తయారయ్యారేంట్రా సామీ.. మరీ ఇంత కక్కుర్తా ?

Bigg Boss 9: కెప్టెన్సీ టాస్క్.. ఇమ్మానుయేల్, భరణి పరువు తీసిన కామనర్!

Bigg Boss 9 : ఈ దమ్ము శ్రీజ ప్రతి దానికి నోరు వేసుకొని పడిపోతుంది, అసలు కన్ఫెక్షన్ రూమ్ లో ఏం జరిగింది?

Bigg Boss 9: ఇమ్మానుయేల్ ఎలిమినేషన్? ఇదెక్కడి ట్విస్ట్?

Bigg Boss 9 Sanjana : సంజనా ఓ కట్లపాము.. ఓ నాగుపాము… మూడు రోజుల్లో ఆమెలో ఇది గమనించారా ?

Big Stories

×