Fauji Update : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో ప్రభాస్ ఒకరు. వాస్తవానికి అందరికంటే ముందు పాన్ ఇండియా హీరోగా మంచి పేరును సంపాదించుకున్నారు ప్రభాస్. వరుసగా సినిమాలు చేస్తున్న తరుణంలో ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో విపరీతమైన గుర్తింపు పొందుకున్నాడు.
ఒక సినిమా కోసం హీరో ఐదు సంవత్సరాలు టైం కేటాయించడం అనేది మామూలు విషయం కాదు. కానీ ప్రభాస్ ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేసి ఆ సాహసం చేశాడు. అందుకే ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే తనకంటూ ఒక రేంజ్ సంపాదించుకున్నాడు. బాహుబలి సినిమా ప్రభాస్ కు మాత్రమే కాకుండా తెలుగు సినిమాకి కూడా బాగా ఉపయోగపడింది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఘనత ఎస్ఎస్ రాజమౌళికి దక్కుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ప్రభాస్ షూటింగ్ డీటెయిల్స్
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలైంది. ప్రభాస్ కెరియర్ లో ఇప్పటికే దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలు ఉన్నాయి. ఇక ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వంలో నటించిన రాజా సాబ్ సినిమా డిసెంబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉంది. ఆగస్టు రెండవ వారం నుంచి హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న పౌజి సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో జరగబోయే స్పిరిట్ సినిమాలో సెప్టెంబర్ ఎండింగ్ నుంచి పాల్గొన్న ఉన్నాడు. ఈ విషయాన్ని స్వయంగా సందీప్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.
వరుస సినిమాలు
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఏకంగా ఐదు సినిమాలను చేశాడు. ఈ ఐదు సినిమాలలో మూడు సినిమాలు ఊహించిన సక్సెస్ ఇవ్వలేకపోయాయి. కానీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించి మంచి కం బ్యాక్ ఇచ్చింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా ఏ స్థాయి సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా చాలా పెద్ద మార్పును తీసుకొచ్చింది. సినిమా విడుదలైన తర్వాత చాలామంది పురాణాలు గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కల్కి పార్ట్ 2 కోసం చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ప్రభాస్ చేతిలో ఉన్న మూడు ప్రాజెక్టుల పైన కూడా బీభత్సమైన అంచనాలు ఉన్నాయి.
Also Read: Sandeep Reddy Vanga: గుడ్ న్యూస్.. విజయ్ ముందు స్పిరిట్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి