TVK Vijay: తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో, తమిళ్లో విజయ్ కి అదే రేంజ్ క్రేజ్ ఉంది. విజయ్ చేసిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి. స్నేహితుడు సినిమాతో హీరోగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు విజయ్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది.
ఆ తర్వాత నుంచి విజయ్ సినిమాలు తెలుగులో విడుదలవడం మొదలయ్యాయి. ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన తుపాకీ సినిమా మంచి సక్సెస్ అయింది. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం విజయ్ హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత తన సినిమాలు విడుదల అవుతున్న కూడా తెలుగు ప్రమోషన్స్ కి ఎప్పుడు హాజరు కాలేదు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన వారసుడు సినిమా ప్రమోషన్స్ కూడా విజయ్ హాజరు కాలేదు.
తమిళ రాజకీయాల్లో చాలా మంది సినిమా బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన నాయకులు ఉన్నారు. ఇక రీసెంట్ గా తలపతి విజయ్ కూడా తమిళ వెట్రి కలగం (Tvk Party) అనే పార్టీ అని పెట్టాడు. విజయ్ పార్టీ మీటింగ్స్ కి విపరీతంగా జనాలు హాజరవుతున్నారు. అలానే కొంతమంది సెలబ్రిటీస్ విజయ్ కు సపోర్ట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా సైమా ఫంక్షన్ కి హాజరైన త్రిష (Trisha) విజయ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. విజయ్ కొత్త ప్రయాణానికి గుడ్ లక్ తెలియజేశారు త్రిష. ఆయన ఏదైతే కల అనుకుంటున్నారో. ఆ కల నిజమవ్వాలి. ఖచ్చితంగా ఆయన సాధిస్తారు అంటూ విజయ్ గురించి మాట్లాడింది. వీరిద్దరూ కలిసి తమిళ్లో చేసిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. విజయ్ ప్రస్తుతం హెచ్ వినోద్ దర్శకత్వంలో జన నాయగన్ అనే సినిమాను చేస్తున్నాడు.
విజయ్ నటిస్తున్న జననాయగన్ ( Jananayagan) సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్లో సినిమాలు విడుదలవుతున్నాయి అంటే వాటి మార్కెట్ ఇంకో రేంజ్ లో ఉంటుంది. మామూలు రోజుల్లో కంటే కూడా ఎక్కువ రెవెన్యూ సంక్రాంతి సీజన్ లో వస్తుంది. అందుకే చాలామంది సంక్రాంతికి సినిమా విడుదల చేసే ఆలోచన పెట్టుకుంటారు. కొన్నిసార్లు తమిళ సినిమాలు కూడా సంక్రాంతి పోటీకి వస్తుంటాయి. విజయ్ మాస్టర్ (Master) సినిమా అప్పట్లో సంక్రాంతి సీజన్ లో విడుదలైంది. అలానే వారసుడు (Vaarasudu) కూడా సంక్రాంతికి విడుదలైంది. ఇప్పుడు జననాయగన్ 2026 సంక్రాంతికి విడుదల కాబోతుంది.
Also Read: Pookie: సోషల్ మీడియా దెబ్బకి పూకి ను కాస్త బూకి చేశారు