BigTV English
Advertisement

Joint Collector: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. జాయింట్ కలెక్టర్ పదవి రద్దు, ఇక ఎఫ్ఎస్ఓలుగా..?

Joint Collector: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. జాయింట్ కలెక్టర్ పదవి రద్దు, ఇక ఎఫ్ఎస్ఓలుగా..?

Joint Collector: తెలంగాణలో జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లను ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో అడవి భూ సర్వే, హక్కుల నిర్ధారణ, సెటిల్‌మెంట్ పనులు వీరి పరిధిలోకి వస్తాయి. 1967 ఫారెస్ట్ యాక్ట్ కింద రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పర్యవేక్షణలో దీనిని అమలు చేయనుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.


ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లే విధులు ఇవే..

ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లు.. అటవీ భూముల హక్కులు, అటవీ ప్రాంతాల నిర్దారణ చేపడతారు. వీరిని 1927 చట్టం ప్రకారం నియమిస్తారు. వీళ్లు భూముల వివరాలను పరిశీలించడం, అవకతవకలు ఉన్నవాటిపై విచారణ నిర్వహించడం, అటవీ భూములకు సంబంధించిన ప్రకటనలు జారీ చేయడం వంటివి చేస్తారు. అటవీ ప్రాంతంలోకి ప్రవేశించే అధికారం వీరికి ఉంటుంది.


ALSO READ: Jobs in RITES: రైట్స్‌లో భారీగా ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే జాబ్ మీదే బ్రో, ఇంకెందుకు ఆలస్యం

అదనపు కలెక్టర్ డ్యూటీ ఇదే..

అదనపు కలెక్టర్ పదవిలో ఉన్న అధికారులు కలెక్టర్‌కు సహాయంగా రెవెన్యూ కార్యకలాపాలు, భూముల కేటాయింపులు, పౌరసరఫరాలు, భూభారతి వంటి అంశాలన పర్యవేక్షిస్తారు. అదే విధంగా గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాల స్థానిక సంస్థల అభివృద్ధి ప్రణాళికలను చూసుకుంటారు. పరిశుభ్రత, పచ్చదనం వంటి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు, వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. వివిధ ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షిస్తారు మరియు క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తర్వాత వీరు ముఖ్యంగా ఉంటారు.

ALSO READ: Postal Monthly Scheme: ప్రతి నెలా రూ.10,000 ఆదాయం.. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ గురించి తెలుసా?

Related News

Sri Chaitanya School: శేరిలింగంపల్లిలో శ్రీ చైతన్య స్కూల్ సీజ్.. భవన నిర్మాణంలో ఉల్లంఘనలు..!

Telangana Liquor Shop: మద్యం షాపులకు భారీగా ధరఖాస్తులు.. అత్యధికంగా ఆ జిల్లాలోనే

Yadadri Bhuvanagiri: కలెక్టర్ చేపట్టిన వినూత్న కార్యక్రమం.. సక్సెస్ అయిన ఉద్యోగవాణి

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. 34 శాతం ముస్లిం ఓట్లన్నీ కాంగ్రెస్ వైపేనా..? సర్వేలు ఏం చెబుతున్నాయంటే?

Hyderabad News: 8 ఏళ్ల పోరాటం.. హైడ్రా సాకారం, ఆనందంలో ప్లాట్ యజమానులు

Weather News: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం, కాసేపట్లో కుండపోత వాన

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. పోటీలో 58 మంది అభ్యర్థులు

Big Stories

×