Oppo Offers: ఈ దీపావళి పండుగకు స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? మరి మీరు వెతుకుతున్న సరైన సమయం వచ్చేసింది. ఎందుకంటే ఒప్పో దీపావళి 2025 ప్రత్యేక ఆఫర్లు ప్రారంభమయ్యాయి. ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్. తగ్గింపు ధరలు, క్యాష్ బ్యాక్‌లు, ఎక్స్ చేంజ్ ఆఫర్లు, ఈఎంఈ సదుపాయం ఇక పండుగలో గిఫ్ట్‌గా కొత్త మొబైల్ తెచ్చుకోవడం మరింత సులభం అవుతుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
డిస్కౌంట్స్ – బ్యాంక్ ఆఫర్లు – క్యాష్‌బ్యాక్‌లు
ఈసారి ఒప్పో తన పాపులర్ మోడల్స్‌పై భారీ తగ్గింపులు ఇస్తోంది. రెనో సిరీస్, ఎఫ్ సిరీస్, ఏ సిరీస్ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఉదాహరణకు, 30 వేల రూపాయల రేంజ్‌లో ఉన్న రెనో మోడల్స్ ఇప్పుడు 25-26 వేల మధ్య అందుబాటులో ఉన్నాయి. అలాగే ఏ సిరీస్ బడ్జెట్ ఫోన్లపై 3-4 వేల వరకు తగ్గింపు ఉంది. పలు బ్యాంకులతో ఒప్పో టైప్ అయింది. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్లతో కొనుగోలు చేస్తే 10శాతం వరకు క్యాష్ బ్యాక్ వస్తోంది. కొన్ని ప్రత్యేక బ్యాంక్ కార్డులపై ఇన్ స్టంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అంటే పండుగ సమయంలో ఫోన్ కొంటే నిజంగానే మన జేబుకు తగ్గింపు ఖాయం.
Also Read: Ganesh Festivals: గణేశోత్సవంలో షాకింగ్ ఘటన.. లడ్డూ కేవలం రూ. 99! ఎక్కడో తెలుసా?
ఎక్స్ చేంజ్ ఆఫర్ -ఈఎంఐ సౌకర్యం
మీ పాత మొబైల్‌ని ఇచ్చి కొత్త ఒప్పో ఫోన్ తీసుకోవచ్చు. ఎక్స్ చేంజ్ విలువకు అదనంగా 2 వేల రూపాయల వరకు బోనస్ కూడా ఇస్తున్నారు. పాత ఫోన్ వాడకంగా పడి ఉంటే దాన్ని ఇచ్చేసి కొత్త ఒప్పో ఫోన్ తీసుకోవడం బెటర్ కదా! ఈ దీపావళి ఆఫర్లలో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. అంటే ఎటువంటి అదనపు వడ్డీ లేకుండా సులభంగా ఈఎంఐల్లో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్‌గా కేవలం 1,500 – 2,000 రూపాయలు మాత్రమే కట్టాల్సి ఉంటుంది.
ఫెస్టివల్ కాంబో ఆఫర్లు -ప్రత్యేక గిఫ్ట్ బాక్స్
మొబైల్‌తో పాటు ఒప్పో ఇయర్ బడ్‌లు, స్మార్ట్ వాచ్‌లను కూడా తగ్గింపు ధరలతో ఇస్తున్నారు. కాంబో డీల్స్ తీసుకుంటే విడిగా కొనుగోలు చేసినప్పుడు కంటే 3-4 వేల వరకు సేవ్ అవుతుంది. ఈసారి ఒప్పో దీపావళి స్పెషల్ ఎడిషన్ గిఫ్ట్ బాక్స్ కూడా విడుదల చేసింది. ఫోన్‌తో పాటు ప్రీమియం కేస్, ఫాస్ట్ ఛార్జర్, మరియు ఒక చిన్న దీపావళి గిఫ్ట్ కూడా అందిస్తోంది. పండుగలో గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఇది సరైన ఆప్షన్. ఈ ఆఫర్లు దీపావళి సీజన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంటే కొన్ని వారాల పాటు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఆలస్యం చేయకుండా వెంటనే ఆఫర్లు చెక్ చేసి ఫోన్ బుక్ చేసుకోవడం మంచిది. ఒప్పో దీపావళి 2025 ఆఫర్లు నిజంగా వినియోగదారుల కోసం ఒక పండుగ బహుమానం లాంటివి.