Andrew Flintoff: యువరాజ్ సింగ్ ( Yuvraj Singh )…ఈ పేరు వినగానే అందరికీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు గుర్తుకు వస్తాయి. ఇంగ్లాండ్ పై అత్యంత ప్రమాదకరమైన ఇన్నింగ్స్ ఆడిన యువరాజ్ సింగ్.. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు. అయితే ఈ విషయాన్ని తాజాగా ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్ ( Andrew Flintoff ) గుర్తు చేశారు. యువరాజ్ సింగ్ ను అనవసరంగా తాను రెచ్చగొట్టినట్లు తప్పు ఒప్పుకున్నారు. యువరాజ్ సింగ్ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదడానికి తానే కారణం అంటూ ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తాజాగా ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు నా తప్పిదం వల్లే యువరాజ్ సింగ్ రెచ్చిపోయాడని తెలిపాడు.
యువరాజ్ సింగ్ తో ( Yuvraj Singh ) గొడవలో లైన్ క్రాస్ చేశానని ఈ సందర్భంగా ఆండ్రూ ఫ్లింటాఫ్ పేర్కొన్నారు. ఈ దెబ్బకు యువరాజు సింగ్ రెచ్చిపోయి బ్రాడ్ ( Stuart Broad) బౌలింగ్ లో ఆరు సిక్సులు కొట్టాడని గుర్తు చేశారు. వాస్తవానికి బ్రాడ్ స్థానంలో నేనే ఉండాల్సింది… కానీ అప్పుడు బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న నన్ను చూస్తూ యువరాజు సింగ్ బౌండరీలు బాదాడు. 5 సిక్సర్లు కొట్టగానే ఇంకోటి కూడా బాదాలని నేను కూడా కోరుకున్నానని నవ్వుతూ చెప్పుకొచ్చాడు ఆండ్రూ ఫ్లింటాఫ్. దీంతో ఆండ్రూ ఫ్లింటాఫ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
టి20 వరల్డ్ కప్ 2007 తొలి సీజన్ సమయంలోనే యువరాజ్ సింగ్ ( Yuvi) రెచ్చిపోయాడు. ఇంగ్లాండ్ జట్టు పైన అద్భుతంగా రాణించిన యువరాజు సింగ్… ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. అది కూడా అప్పట్లో ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ గా ఉన్న టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు యూవీ. ఇక ఆ మ్యాచ్ లోనూ టీమిండియా విజయం సాధించింది. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా… టి20 వరల్డ్ కప్ 2007 టోర్నమెంట్ గెలిచిన సంగతి తెలిసిందే. 2007 టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ సమయంలో… ఫైనల్ మ్యాచ్ కూడా పాకిస్తాన్ వర్సెస్ టీం ఇండియా మధ్య జరిగింది. దీంతో ఫైనల్ మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణించిన టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. వెనకాల ఉన్న శ్రీశాంత్ అద్భుతమైన క్యాచ్ అందుకొని ఇండియాకు టైటిల్ అందించాడు. ఇక ఈ టోర్నమెంట్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన యూవీకి టోర్నమెంట్ ఆఫ్ ది సిరీస్ ( Man of the Tournament ) దక్కింది.
Remember that 一 Yuvraj singh vs andrew flintoff fight, ICC 2007 T20 Worldcup.
Yuvi pa ko gussa niklna tha flintoff par lekin utaar diya bechare ( Stuart Board )6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣
Happy Birthday Yuvraj Singh.!#Yuvi I @YUVSTRONG12pic.twitter.com/FTOInm0EOv
— CricRun (@CricRun) December 12, 2024
In the spirit of Stuart Broad, it is only plausible to declare Yuvraj Singh's six sixes against him to be null and void because it was Andrew Flintoff who fired Yuvraj up that day & poor Broad had to bore the brunt of his aggression. pic.twitter.com/RVsVVJtczN
— Rahul Sharma (@CricFnatic) April 28, 2023