The Raja Saab: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ అనతి కాలంలోనే పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈయన బాహుబలి 2 చిత్రంతో ఏకంగా ప్రపంచ స్థాయినే ఆకర్షించారు అని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత అన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు ప్రకటిస్తూ.. అటు నిర్మాతలకు కూడా మినిమం గ్యారెంటీ అనిపించే హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు దాదాపు 6 ప్రాజెక్టులు ఈయన చేతిలో ఉన్నాయనే చెప్పాలి. అందులో మొదటిగా విడుదల కాబోతున్న చిత్రం మారుతి (Maruthi) దర్శకత్వంలో తొలిసారి హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్ నటిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన రిద్దీ కుమార్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ ప్రభాస్ తాత పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడు బిజినెస్ డీల్ జరిగినట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ ఏరియాలో ఏ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నారు అనే విషయం ఇప్పుడు చూద్దాం..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నిజాం ఏరియాలో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా హక్కులను దక్కించుకున్నారు.
తూర్పుగోదావరి – బాహుబలి రాజులు
వెస్ట్ – కృష్ణ జిల్లాలలో ఉష చిత్రాలు
నెల్లూరు – భాస్కర్ రెడ్డి
సీడెడ్ – శోభన్ బాబు.. ఈ సినిమా హక్కులను దక్కించుకున్నారు. గుంటూరు, వైజాగ్ ఏరియాలలో ఈ సినిమా హక్కులను ఎవరు సొంతం చేసుకున్నారు అనే విషయం ఇంకా తెలియలేదు.
ప్రభాస్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. సీతారామం సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రముఖ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమా చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టైటిల్ ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్వి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో తొలిసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించనున్నారు ప్రభాస్. అలాగే కల్కి 2, సలార్ 2 చిత్రాలలో కూడా ప్రభాస్ నటిస్తున్నారు.. అంతేకాదు మరో యంగ్ డైరెక్టర్ కి కూడా ప్రభాస్ అవకాశం ఇచ్చినట్లు సమాచారం ఇలా వరుస పెట్టి సినిమాలు చేస్తే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
ALSO READ:Vash level 2: థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా సంచలనం.. మొదటి చిత్రంగా!