Sai Durga Tej: ఒక ఈవెంట్ లో మహేష్ బాబు.. ఇండస్ట్రీలో హీరోల మధ్య ఉన్న వార్స్ గురించి ఒక మాట చెప్పాడు. మేము మేము బాగానే ఉంటాం.. మీరు కూడా అలానే ఉంటే మంచిది అని.. అది వాస్తవం. ఇండస్ట్రీలో ఎవరూ.. ఎవరిని వదులుకోరు. ఒకసారి కొట్టుకుంటే.. ఇంకోసారి కలిసిపోతారు. కానీ, చివరకు పిచ్చోళ్ళు అయ్యేది మాత్రం అభిమానులే. ఇది అందరికి అర్ధమైతే అసలు ఫ్యాన్ వార్స్ అనేవే ఉండవు. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. మెగా – అల్లు కుటుంబాల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా కూడా వారు వారు ఒకటి. ఎప్పటికైనా రక్త సంబంధం అనేది పోదు. కానీ, ఈ రెండు కుటుంబాలు విడిపోయాయి అని వార్త వచ్చిన ప్రతిసారి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఒకపక్క.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక పక్క సోషల్ మీడియాలో యుద్దాలు చేసుకొనేవారు.
ముఖ్యంగా అల్లు అర్జున్ – పవన్ కళ్యాణ్ వివాదం అప్పుడు అయితే రక్తాలు వచ్చేటట్టు కొట్టుకున్నారు కూడా. పవన్ కళ్యాణ్ కు ప్రచారం చేయకుండా బన్నీ .. తన స్నేహితుడుకు సపోర్ట్ చేయడానికి వెళ్లడం ఇండస్ట్రీని మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. సొంత మేనమామకు వ్యతిరేకంగా నిలబడ్డాడు అంటే గట్స్ ఉండాలి. బన్నీ ఏ ధైర్యంతో నిలబడ్డాడు అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. అవి ఎక్కడ వరకు వెళ్లాయి అంటే సొంతింట్లో వారే అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా మారారు. నాగబాబు, నిహారిక, సాయి దుర్గా తేజ్.. ఇలా ఒక్కొక్కరు బన్నీకి వ్యతిరేకంగా మాట్లాడారు. ముఖ్యంగా తేజ్.. పవన్ కి వ్యతిరేకంగా వచ్చాడని బన్నీతో తెగదెంపులు కూడా చేసుకున్నాడు. సోషల్ మీడియాలో బన్నీని అన్ ఫాలో అయ్యాడు. అప్పట్లో ఇదే పెద్ద రచ్చ అయ్యింది అంటే అతిశయోక్తి కాదు.
ఇక అప్పటి నుంచి మొన్నీమధ్య తేజ్.. బన్నీ పెద్దవాడు అయ్యాడు అని చెప్పేవరకు కూడా వీరిద్దరూ కలిసి ఎక్కడా కనిపించింది లేదు. నిజం చెప్పాలంటే.. అల్లు కనకరత్నమ్మ మరణమే ఈ రెండు కుటుంబాలను కలిపింది అని చెప్పొచ్చు. అప్పటి వరకు ఎడ ముఖం- పెడ ముఖంగా ఉన్న ఈ రెండు కుటుంబాలు ఆమె మరణంతో ఒక్కటయ్యాయి. అల్లు ఇంట.. మెగా ఫ్యామిలీ మొత్తం అడుగుపెట్టింది. అయితే ఇది కేవలం పైపై పలకరింపులు మాత్రమేనా అంటే ఏమో అది వారికి మాత్రమే తెలియాలి.
మొన్నటికి మొన్న ఉపాసన సీమంతం రోజున అల్లు ఫ్యామిలీ మచ్చుకైనా కనిపించలేదు. కానీ, అల్లు శిరీష్ ఎంగేజ్ మెంట్ కు మాత్రం మెగా ఫ్యామిలీ మొత్తం విచ్చేసింది. చివరకు తేజ్ బ్రదర్స్ కూడా విచ్చేశారు. తేజ్.. బన్నీతో మాట్లాడాడు కూడా. అందుకే వారు వారు బాగానే ఉంటారు అనేది. ఎంత లేదు అనుకున్నా ఏదో ఒకరోజు వారిద్దరూ కలుస్తారు. కానీ వారికి సపోర్ట్ గా నిలబడిన ఫ్యాన్స్ ఇప్పుడు షాక్ అవుతున్నారు. మరి ఈ కలయిక పర్మినెంట్ నా .. లేక ఏ గొడవ రాకూడదు అని పైకి కలిసినట్లు కనిపిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.
PanjaBrothers at #AlluSirish's engagement ceremony! ❤️@IamSaiDharamTej #SaiDurghaTej #SaiDharamTej #VaishnavTej pic.twitter.com/yc44MlYdCg
— Prasanth Naidu SDT (@PrasanthSDT) November 1, 2025