Natasa Stankovic : టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా విడిపోయిన విషయం తెలిసిందే. వీరిద్దరూ తమ తమ జీవితాల్లో ముందుకు సాగుతున్నారు. నటాషా పాండ్యా కి విడాకులు ఇచ్చిన తరువాత తన స్నేహితుడు అలెక్స్ తో ప్రేమాయణం కొనసాగిస్తుందని నిన్న మొన్నటి వరకు రూమర్స్ వినిపించాయి. కానీ తాజాగా సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుంది నటాషా. అయితే అలెక్స్ తో మాత్రం కాదండోయ్. ఇప్పుడు మరో కొత్త వ్యక్తి అని తెలుస్తోంది. అలెక్స్ స్నేహితుడు అని చెప్పి అతనితో ప్రేమాయణం కొనసాగిస్తున్న తరుణంలో తాజాగా నటాషా ఎంగే జ్ మెంట్ వార్త తెలిసి అందరూ ఆశ్యర్యపోవడం విశేషం.
Also Read : Shimron hetmyer : హెట్ మేయర్ అరాచకం..పడుకొని మరి క్యాచ్ పట్టాడు.. ఎక్కడి నుంచి వస్తారో వీళ్లంతా
ఇద్దరూ డేటింగ్ లోనూ..
మరోవైపు హార్దిక్ పాండ్యా కూడా ఓ నటితో డేటింగ్ ఉన్నాడని వార్తలు వినిపించాయి. ఇటీవల వారు ఇన్ స్టాగ్రామ్ లో ఒకరికొకరు అన్ ఫాలో చేసుకున్నారు. దీనిపై కొందరూ అభిమానులు స్పందించారు. పాండ్యా.. వాలియా ఫొటోలకు ఇచ్చిన అన్ని లైకులను కూడా హార్దిక్ పాండ్యా తీసేశాడని మరికొందరూ తెలపడం విశేషం. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్న సమయంలో టీమిండియా ఆడే మ్యాచ్ లతో పాటు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఆడిన మ్యాచ్ ల సందర్భంగా స్టేడియంలో జాస్మిన్ కనిపించేది. హార్దిక్ కెప్టెన్ గా ఉన్న ముంబై టీమ్ బస్సులోనూ ఆమె ప్రయాణించినట్టుగా వార్తలు వినిపించాయి. ఓ వైపు భార్య, మరో వైపు భర్త మరో వ్యక్తులతో డేటింగ్ లో ఉండటం.. బ్రేకప్ కావడం సాధారణం అయిపోయింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా సీక్రెట్ ఎంగేజ్ మెంట్ వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది.
విశ్రాంతి తీసుకున్న హార్దిక్ పాండ్యా..
ఐపీఎల్ 2025 సీజన్ లో ముంబై ఇండియన్స్ కి నాయకత్వం వహించిన హార్దిక్ పాండ్యా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. తరుచూ గాయాల బారిన పడటంతో టెస్టులు ఆడనని.. పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతానని ఇప్పటికే హార్దిక్ బీసీసీకి స్పష్టం చేశాడు. ఇందుకు బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకే ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరిగిన 5 టెస్టుల సిరీస్ లో హార్దిక్ పాండ్యా ఆడటం లేదు. ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా సెప్టెంబర్ లో జరిగే ఆసియా కప్ 2025లో టీమిండియా తరపున తిరిగి ఆడనున్నట్టు తెలుస్తోంది. ఈ టోర్నమెంట్ లో పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ, ఒమన్, హాంకాంగ్ జట్లు పాల్గొనే అవకాశం ఉంది. ఇది యూఏఈలో నిర్వహిస్తారు. ఇక బంగ్లాదేశ్ పర్యటన వాయిదా పడటంతో.. ఆసియా కప్ తరువాత అక్టోబర్ లోనే భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడనుంది. దీంతో ఆసియా కప్, ఆస్ట్రేలియా పర్యటన వరకు హార్దిక్ పాండ్యా కి విరామం దొరికినట్టు అయింది. హార్దిక్ పాండ్యా టీమిండియా లో కీలక ఆటగాడిగా రాణిస్తున్నాడు. అటు బౌలింగ్ లో.. ఇటు బ్యాటింగ్ రెండింటిలో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు.