OTT Movie : ఓటీటీలో ఒక గ్రిప్పింగ్ హారర్ ఆంథాలజీ సిరీస్ 12 సీజన్‌లతో టాప్ లేపుతోంది. ఇది భిన్నమైన స్టోరీలు, బలమైన నటనలు, విజువల్ స్టైల్‌తో హారర్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. 2011లో వచ్చిన మొదటి సీజన్ తోనే ప్రశంసలు అందుకుంది. ఇది ఎమ్మీ, గోల్డెన్ గ్లోబ్ అవార్డులను కూడా గెలుచుకుంది. ఈ సిరీస్ ప్రతి సీజన్ లో ఒక కొత్త కథను కలిగి ఉంటుంది. ఈ సిరీస్ సైకలాజికల్, సూపర్‌నాచురల్ భయాలు, సీరియల్ కిల్లర్స్, సామాజిక సమస్యల చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘అమెరికన్ హారర్ స్టోరీ’ (American Horror Story) ర్యాన్ మర్ఫీ, బ్రాడ్ ఫాల్చుక్ సృష్టించిన ఒక అమెరికన్ హారర్ ఆంథాలజీ టెలివిజన్ సిరీస్. ఇది FX నెట్‌వర్క్‌లో 2011అక్టోబర్ 5న ప్రీమియర్ అయింది. ఈఈ సిరీస్ జెస్సికా లాంగే, సారా పాల్సన్, ఇవాన్ పీటర్స్, లిలీ రాబే వంటి నటీనటుల అద్భుతమైన నటనలకు ప్రసిద్ధి చెందింది. 2024 నాటికి 12 సీజన్‌లు విడుదలయ్యాయి. 13వ సీజన్ కూడా తొందర్లో రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, హులు ఓటీటీలలో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. IMDbలో ఈ సిరీస్ కి 8.0/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
బెన్ హార్మన్ తన భార్య వివియన్ హార్మన్, టీనేజ్ కుమార్తె వైలెట్ తో కలసి జీవిస్తుంటాడు. వీళ్ళు వ్యక్తిగత సమస్యల నుండి తప్పించుకోవడానికి బోస్టన్ నుండి లాస్ ఏంజిల్స్‌లోని ఒక పాత, అందమైన ఇంట్లోకి మకాం మారుస్తారు. బెన్ ఒక సైకియాట్రిస్ట్. తన భార్య వివియన్ వేరొకరితో సంబంధం కారణంగా వైవాహిక సమస్యలతో బాధపడుతుంటారు. అందుకే ఇంటిని కూడా మార్చాల్సి వస్తుంది. వివియన్ కి కూడా గర్భస్రావం అవ్వడంతో మానసిక ఒత్తిడిలో ఉంటుంది. అయితే వీళ్ళు కొనుగోలు చేసిన ఇల్లు ‘మర్డర్ హౌస్ గా పిలవబడుతుంది. ఎందుకంటే ఇక్కడ గతంలో అనేక హత్యలు, భయంకర సంఘటనలు జరిగివుంటాయి. ఈ ఇంట్లో చనిపోయిన వ్యక్తుల దెయ్యాలుగా ఇంకా సంచరిస్తున్నాయని తెలుస్తుంది. ఈ దెయ్యాలు హార్మన్ కుటుంబ జీవితంలోకి వచ్చి వారిని భయాందోళనకు గురి చేస్తాయి.
బెన్ ఇంట్లోనే తన సైకియాట్రిక్ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తాడు. ఇతని దగ్గరికి టేట్ అనే లాంగ్డన్ రోగి వస్తాడు. అతను ఒక ఈ ఇంటితో సంబంధం ఉన్న ఒక దెయ్యం అని తరువాత తెలుస్తుంది. ఇక బెన్ భార్య వివియన్ ఇంట్లో జరిగే అతీంద్రియ సంఘటనలతో భయపడుతూ, ఆమె తన గర్భంలో దుష్ట శక్తి సమస్యలను ఎదుర్కొంటుంది. కథ ముందుకు సాగేకొద్దీ, గతంలో ఈ ఇంట్లో జరిగిన హత్యలు, విషాదాలు, ఒక శాపం గురించి రహస్యాలు బయటపడతాయి. హార్మన్ కుటుంబం ఈ దెయ్యాల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ కథ ఒక విషాదకరమైన సంఘటనతో ముగుస్తుంది. ఇంతకీ బెన్ ఫ్యామిలీ ఈ దెయ్యాలనుంచి బయటపడతారా ? ఈ దెయ్యాలకు బలవుతారా ? ఆ ఇంటి చరిత్ర ఏమిటి ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.
Read Also : భర్త నుంచి దూరంగా… స్టూడెంట్స్ ముందు అన్నీ తీసేసి… చిన్న పిల్లలు చూడకూడని మూవీ