Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)చాలా రోజుల తర్వాత సినిమా వేదికపై కనిపించి సందడి చేశారు. ఈయన హీరోగా జ్యోతి కృష్ణ(Jyothi Krishna) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హరిహర వీరమల్లు (Harihara Veerumallu)సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేడు ఉదయం ఈ సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది .ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ లుక్ లో కనిపించి సందడి చేశారు. ఇలా వీరమల్లు ప్రెస్ వీటి కార్యక్రమం ఉదయం నిర్వహించగా ప్రస్తుతం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరుగుతుంది. హైదరాబాదులోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఇకపోతే ఉదయం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
లక్షల విలువ..
బ్లాక్ కలర్ టీ షర్ట్ , బ్లూ కలర్ జీన్స్ లో చాలా సింపుల్ లో పవన్ కనిపించారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ చేతి వాచ్ (Wrist Watch)కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోని పవన్ కళ్యాణ్ ధరించిన వాచ్ ఏ కంపెనీకి చెందినది దాని ఖరీదు ఎంత అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కార్యక్రమంలో కట్టిన వాచ్ ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బ్రాండ్ అయిన”Eberhard &Co” అనే సంస్థకు చెందిన వాచ్ అని తెలుస్తోంది. ఈ వాచ్ ఖరీదు అక్షరాలా రూ.1,85,148 అని తెలుస్తోంది.
సెలబ్రిటీలకు సర్వసాధారణం…
ఇలా వాచ్ ఖరీదు లక్షల విలువ చేస్తుందనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సెలబ్రిటీలు ఇలా ఖరీదైన బ్రాండెడ్ వస్తువులను ఉపయోగించడం సర్వసాధారణం. సెలబ్రిటీలు వేసుకునే బట్టల నుంచి మొదలుకొని తిరిగే కార్లు ధరించే నగలు ఉండే ఇల్లు ఎంతో ఖరీదైనవి బ్రాండెడ్ వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇక వీటి ధరలు సెలబ్రిటీలకు సర్వసాధారణమైన సామాన్య ప్రజలకు మాత్రం చాలా ఖరీదైనవిగా అనిపిస్తుంటాయి. ఇలా సెలబ్రిటీలు ఉపయోగించే ఒక వాచ్ ఖరీదుతో ఒక మధ్యతరగతి కుటుంబం ఏడాది మొత్తం ఎంతో సంతోషంగా బ్రతికేయొచ్చు.
సోలో హీరోగా పవన్..
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ధరించిన ఈ వాచ్ గురించి కూడా అదే విధంగా చర్చలు జరుగుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఈయన సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ చివరిగా బ్రో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాలో కూడా సాయి ధరమ్ తేజ్ నటించారు. ఇక ఈయన సోలోగా వకీల్ సాబ్ సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. ఈ సినిమా తర్వాత హరిహర వీరమల్లు సినిమా ద్వారా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా జూలై 24వ తేదీ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు.