E-Paper
Advertisement

Udit Narayan: నా శరీరంలో ఆ అవయవం తొలగించారు.. సింగర్ ఉదిత్ నారాయణపై మొదటి భార్య ఫిర్యాదు

Udit Narayan: నా శరీరంలో ఆ అవయవం తొలగించారు.. సింగర్ ఉదిత్ నారాయణపై మొదటి భార్య ఫిర్యాదు
Advertisement

Udit Narayan: తెలుగులో ‘మీసాల పిల్లా’ అంటూ.. ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఉదిత్ నారాయణ చిక్కుల్లో పడ్డారు. ఆయన మొదటి భార్య రంజనా ఝా, ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై బీహార్‌లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఇంటకు ముందే ఆమె ఉదిత్ పై కేసు వేశారు. తాజాగా మరో సారో వివాదం తెరపైకి తీసుకొచ్చారు. ఈ సారి రంజనా చేసిన అత్యంత షాకింగ్ ఆరోపణ చేశారు. అది ఏమిటంటే, 1996లో అనారోగ్యం నెపంతో తనను ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి, తన అంగీకారం లేకుండానే గర్భాశయాన్ని తొలగించారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇటీవల మరో సమస్య కోసం డాక్టర్‌ను సంప్రదించినప్పుడు మాత్రమే ఈ విషయం తనకు తెలిసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మరోసారి ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణపై ఆమె కేసు పెట్టారు.

Read also-Hey Bhagawan Trailer: సస్పెన్స్ హిలేరియస్ గా హే భగవాన్ ట్రైలర్.. ఎలా ఉందంటే?

కుటుంబ సభ్యులపై కూడా..

Advertisement

ఈ కుట్రలో ఉదిత్ నారాయణ్‌తో పాటు ఆయన సోదరులు సంజయ్ కుమార్ ఝా, లలిత్ నారాయణ్, ఆయన రెండో భార్య దీపా నారాయణ్ కూడా ఉన్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు 1984లో ఉదిత్ నారాయణ్‌తో పెళ్లయిందని, ఆ తర్వాత ఆయన ముంబై వెళ్లి అక్కడ దీపా నారాయణ్‌ను రెండో వివాహం చేసుకున్నారని ఆమె తెలిపారు. బీహార్‌లోని సుపాల్‌ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్‌లో ఆమె ఈ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలు జరిగి చాలా కాలం (దాదాపు 30 ఏళ్లు) గడిచిపోయినందున, ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. గతంలో ఉదిత్ నారాయణ్ తనకు భరణం ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ ప్రస్తుతం తనను పట్టించుకోవడం లేదని, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నానని రంజనా పేర్కొన్నారు.

Read also-Peddi: పెద్దికి ఆ సెంటిమెంట్ కలిసొచ్చేనా.. ఆ డేట్ ఫిక్స్ అయితే హిస్టరీ రిపీట్!

ఇంతకు ముందు..

Advertisement

గతంలో (2006లో) కూడా రంజనా ఝా ఉదిత్ నారాయణ్ భార్యగా హక్కుల కోసం పోరాడారు. అప్పట్లో కొంతకాలం వివాదం నడిచిన తర్వాత, ఉదిత్ నారాయణ్ ఆమెను తన మొదటి భార్యగా అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ గర్భాశయం తొలగింపు వంటి తీవ్రమైన ఆరోపణలతో ఆమె ముందుకు రావడం చర్చనీయాంశమైంది. దీనిపై ఉదిత్ నారాయణ్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. తాజాగా దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×