BigTV English

BRS Politics: సీబీఐ దిగితే కారు షెడ్డుకే.. డజను మాజీలు, అరడజను ఎమ్మెల్యేలు జంప్?

BRS Politics: సీబీఐ దిగితే కారు షెడ్డుకే.. డజను మాజీలు, అరడజను ఎమ్మెల్యేలు జంప్?

BRS Politics: కాళేశ్వరం కమిషన్ నివేదిక బీఆర్ఎస్ పార్టీలో కుదుపు మొదలైందా? ఆ పార్టీ నేతలు ఆలోచనలో పడ్డారా? బీఆర్ఎస్‌లో పొలిటికల్ కెరీర్ ఉండదని కొందరు నేతలు డిసైడ్ అయ్యారా? దాదాపు డజను మంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారా? వీరితోపాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారా? జరుగుతున్న పరిణామాలతో బీఆర్ఎస్ కీలక నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? అవుననే సంకేతాలు ఆ పార్టీ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది.


కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవకతవకలు జరిగినట్టు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చి చెప్పింది. దీనిపై సోమవారం సాయంత్రం సీఎం రేవంత్ మొదలు కీలక మంత్రులంతా మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సింది చెప్పారు. దీనిపై అసెంబ్లీలో చర్చిస్తామని, ఆ తర్వాత ఏం చెయ్యాలి అనేదానిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు సీఎం రేవంత్‌రెడ్డి.

కాలేశ్వరం కమిషన్ రిపోర్టుపై రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేయబోతోంది? అధికార పార్టీ తీసుకోబోయే నిర్ణయాలు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంటన్నది ఆధారపడి ఉంటుందా? కమిషన్ నివేదికను కారు పార్టీ నేతలు తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నారు.


దీనిపై సిట్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి అనుకూలంగా దర్యాప్తు చేస్తుందని ఆ పార్టీ నేతలు రీసౌండ్ చేస్తారని భావిస్తోంది. అదే సీబీఐకి ఇస్తే ఏ విధంగా ఉంటుందనే ఆలోచన చేస్తోందట అధికార పార్టీ. ఇప్పుడు అధికార పార్టీ ఏ విధంగా అడుగులు వేస్తుందనేది అసలు ప్రశ్న.

ALSO READ: కాళేశ్వరం ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్టు, పీసీ ఘోష్ రిపోర్టులో ఏముంది?

కమిషన్ రిపోర్టు బయటకు రాగానే పార్టీ నేతలతో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నివేదికపై దాదాపు ఆరుగంటలకు పైగానే చర్చించారు. సోమవారం నాడు జరిగిన.. జరుగుతున్న పరిణామాలను గమనించిన కేసీఆర్, నేతలను అలర్ట్ చేశారు.

దర్యాప్తు పేరుతో ఎప్పుడైనా, ఎవరినైనా అరెస్టు చేసే ఛాన్స్ ఉందని చెప్పకనే చెప్పారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నేతలను హెచ్చరించారు. ఆనాటి మంత్రులతోపాటు తనను విచారణకు పిలిచి అరెస్టు చేస్తారని ముందుగానే సంకేతాలు ఇచ్చారు పెద్దాయన.

జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న బీఆర్ఎస్ నేతలు ఆలోచనలోపడ్డారు. ఈ గండం నుంచి గట్టెక్కాలంటే బీజేపీ సాయం లేకుంటే కష్టమని అంటున్నారు. పార్టీని విలీనం చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తే పరిస్థితి ఉందని అనుకుంటున్నారు. అలా చేసే బదులు మనకు జారుకుంటే బెటరని దాదాపు డజను మాజీ ఎమ్మెల్యేలు ఓ అంచనాకు వచ్చనట్టు తెలుస్తోంది.

వీరు కాకుండా మరో ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారే పనిలో ఉన్నట్లు ఫీలర్లు వస్తున్నాయి. పార్టీ మారే విషయంలో జాతీయ పార్టీల నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాత జాయిన్ కావాలని ఆలోచన చేస్తున్నారట. ఏ నీళ్ల కోసం కొట్లాడి తెలంగాణను సాధించామని బీఆర్ఎస్ నేతలు పదేపదే రాజకీయ స్పీచ్‌లు ఇస్తున్నారు. అదే నీటి ప్రాజెక్టు కారు పార్టీని నిట్ట నిలువునా ముంచేసిందనే చెప్పవచ్చు.

Related News

Congress: బీసీ రిజర్వేషన్ల కోసం.. హస్తినలో తెలంగాణ కాంగ్రెస్ మహాధర్నా

Weather Alert: బీ అలర్ట్..! తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కుండపోత వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు..

KTR In Delhi: కేటీఆర్ ఢిల్లీ ముచ్చట్లు.. ఆ భేటీ ఉద్దేశమేంటి?

KCR Big Sketch: గువ్వల రిజైన్ వెనుక కేసీఆర్ కొత్త స్కెచ్ ?

Farmers: సొంత భూమి ఉంటే చాలన్నా.. సింపుల్‌గా రూ.50వేలు పొందండిలా..?

Chiranjeevi: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో చిరంజీవి? కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కేటీఆర్

Big Stories

×