Guntur District Tragedy: గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిడుగు పడి ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఏపీలో గత కొద్దిరోజులుగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటికంపాడు వద్ద వరి పొలాల్లో మహిళా కూలీలు పనిచేస్తుండగా.. వారిపై ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన మహిళలను ఆసుపత్రికి తరలించారు.
మృతుల వివరాలు చూస్తే.. మరియమ్మ(45), షేక్ ముజాహిద్(38) గా గుర్తించారు పోలీసులు.
కాగా ఈ రెండు, మూడు రోజులు భారీగా వర్షాలు, పిడుగులు పడే అవకాశముందని.. వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం.. ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు
పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, తిరుపతి,ఏలూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, పలు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు అవకాశం ఉందని తెలిపింది. వర్షాలు మొదట చినుకులుగా పడతాయి, తరువాత తీవ్రమయ్యే అవకాశం ఉంది. మరోవైపు, కాకినాడ – రాజమండ్రి ప్రాంతంలో అర్ధరాత్రి వరకు నిరంతరంగా మోస్తరు వర్షాలు కురుస్తాయి.వర్షాలు మొదట చినుకులుగా పడతాయి, తరువాత తీవ్రమయ్యే అవకాశం ఉంది. మరోవైపు, కాకినాడ – రాజమండ్రి ప్రాంతంలో అర్ధరాత్రి వరకు నిరంతరంగా మోస్తరు వర్షాలు కురుస్తాయి.