E-Paper

Upcoming Movies : టాలీవుడ్ లో సినిమాల సందడి.. ఏ మూవీ ఎప్పుడంటే..?

Upcoming Movies : టాలీవుడ్ లో సినిమాల సందడి.. ఏ మూవీ ఎప్పుడంటే..?
Advertisement

Upcoming Movies : టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల సందడి ఎప్పుడు ఉండనే ఉంటుంది. ప్రతి నెల కూడా చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాయి.. అయితే ఈమధ్య స్టార్ హీరోల సినిమాలు కాస్త తగినట్లు కనిపిస్తున్నాయి. జూన్ జూలైలో విడుదల అవ్వాలనుకున్న సినిమాలన్నీ కూడా పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తుంది. దానికి ఈ ఏడాదిలో స్టార్ హీరోలు సినిమాలు చాలానే థియేటర్లలోకి రావాల్సి ఉంది.. అనుకోని కారణాల వల్ల కొన్ని సినిమాలు సైలెంట్ గా విడుదల తేదీని వాయిదా వేసుకున్నాయి.. మరికొన్ని సినిమాలు రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించాయి.. ఇకపోతే ఇప్పుడు నటిస్తున్న స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడు థియేటర్లలోకి రాబోతున్నయో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడు రిలీజ్..?

బాక్స్ ఆఫీస్ వద్ద ప్రతి ఏడాది స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతూనే ఉంటాయి.. ఈ ఏడాది సంక్రాంతి మొదలుకొని ఇప్పటివరకు చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి.. కొన్ని సినిమాలు అనుకోని కారణాలవల్ల వాయిదా పడిన విషయం కూడా తెలిసిందే.. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ వద్ద హీరోల సందడి కొనసాగుతుంది. ఏ మూవీ ఎప్పుడు రిలీజ్ కాబోతుందో ఒక్కసారి మనం ఇక్కడ చూసేద్దాం..

ది ప్యారడైజ్..

Advertisement

న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అప్పటివరకు ఈ క్లాస్ హీరోగా ఉన్న నాని ఈ సినిమా తర్వాత మాస్ హీరోగా మారాడు.. ఈ సినిమాను టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు.. ఇప్పుడు మరోసారి ఇదే డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు నాని. ఆ మూవీనే ది ప్యారడైజ్.. దాదాపు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.. అయితే ఈ నెలలో సినిమా రిలీజ్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు సినిమా వాయిదా పడినట్లు తెలుస్తుంది.. ఈ ఏడాది సెప్టెంబర్ 25న సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు..

ఆదర్శ కుటుంబం..

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న లేటెస్ట్ చిత్రం ఆదర్శ కుటుంబం.. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్ ప్రకటించినట్టు తెలుస్తుంది.

జైలర్ 2..

Advertisement

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్ 2.. తమిళ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో గతంలో వచ్చిన జైలర్ సినిమాకు ఈ సినిమా సీక్వల్ గా రాబోతుంది.. ఈ మూవీపై మొదటి నుంచి మంచి అంచనాలు క్రియేట్ అవుతూ వస్తున్నాయి.. మరి సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని తలైవాభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమాని అక్టోబర్ 15న రిలీజ్ చేసేందుకు అనౌన్స్ చేశారు.

విశ్వంభరా..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం విశ్వంభరా.. డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 16 రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు..

NBK111..

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం NBK111.. భారీ యాక్షన్ కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 4 న రిలీజ్ కాబోతుంది.

రణబాలి..

పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడీగా నటిస్తున్న చిత్రం రణబాలి.. రాహుల్ సంకృత్యాన్ గతంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మిస్తున్నారు. మూవీ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది అని తెలుస్తుంది.

Also Read :Gundeninda GudiGantalu Today episode: చింతామణి నెక్స్ట్ ప్లానేంటి..? బాలు పై అరుణ్ రివేంజ్.. శృతి ఎంత పని చేసింది..?

ఇక వీటితో పాటుగా చిరు – బాబీ, అనిల్ రావిపూడి- వెంకీ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతున్నాయి.. ఇప్పటివరకు రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నవి ఈ సినిమాలు.. మరి సడన్గా మరికొన్ని సినిమాలు యాడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.. ఏది ఏమైనా కూడా ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోల సినిమాలతో వారు నడుస్తుందని అర్థమవుతుంది.

Related News

15వ రోజు కూడా తగ్గని సమంత జోరు.. 100 కోట్ల క్లబ్‌లోకి ‘మా ఇంటి బంగారం’?

జాన్వీ కపూర్ మంత్లీ ఇన్‌కమ్ తెలిస్తే మైండ్ బ్లాకే!

లెనిన్ కోసం డ్రాగన్ .. బాక్సాఫీస్ లెక్కలు మారతాయా ?

స్కూల్ డేస్ లవ్ ప్రపోజల్.. ‘రాఖీ’తో ట్విస్ట్ ఇచ్చిన గేమ్ ఛేంజర్ బ్యూటీ!

జాన్ అబ్రహాం ఆకలికి హోటల్ ఓనర్ షాక్.. ఒక్క సిట్టింగ్‌లో అన్ని చపాతీలు తిన్నాడా?

హృతిక్ నుంచి రూ. 400 కోట్ల భరణం? అసలు నిజం బయటపెట్టిన ఫరా!

ఆ బూతు బొమ్మలని తక్షణమే తొలగించండి.. టెక్ దిగ్గజాలపై కోర్టుకెక్కిన బాలీవుడ్ బ్యూటీ

Big Stories

×