BigTV English

Upcoming Movies In Theater : ఆగస్టులో సినిమాల సందడి.. ఏ ఏ సినిమాలంటే..?

Upcoming Movies In Theater : ఆగస్టులో సినిమాల సందడి.. ఏ ఏ సినిమాలంటే..?

Upcoming Movies In Theater : ప్రతి నెల థియేటర్లలోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి.. కొన్ని సినిమాలు భారీ అంచనాలతో తీయటనలకి వచ్చిన సరే.. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ టాక్ ను సంపాదించుకోలేక పోతున్నాయి. ఈమధ్య విడుదలైన సినిమాలు అన్నీ కూడా దాదాపు యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి.. గత నెలలో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటే.. మరి కొంతమందిని నిరాశపరిచింది. నిన్న వచ్చిన విజయ్ దేవరకొండ సినిమా సైతం ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ క్రమంలో ఎక్కువమంది ఆగస్టు నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఈ నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఏంటి? ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


ఆగస్టు నెలలో థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు..

సార్ మేడమ్…


తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, నిత్యామీనన్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం సార్ మేడమ్.. తమిళ్లో తలైవా తలైవి అనే పేరుతో ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేస్తుంది. ఇక్కడ కూడా అలాంటి టాక్ ని సొంతం చేసుకుందని తెలుస్తుంది. నిన్న రిలీజ్ అయినయి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని అందుకోవడం విశేషం.

దీంతో పాటుగా ఉసురే, థాంక్ యు డియర్ అనే మరో రెండు చిన్న సినిమాలతో పాటు బాలీవుడ్ మూవీస్ సన్నాఫ్ సర్దార్ 2, ధఢక్ 2 ఆడియన్స్ తీర్పు కోసం వచ్చేశాయి.

బకాసుర రెస్టారెంట్..

కమెడియన్ ప్రవీణ్, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ హారర్ థ్రిల్లర్ ‘బకాసుర రెస్టారెంట్’. ఈ మూవీకి శివ దర్శకత్వం వహించగా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వార్ 2..

గ్లోబల్ స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘వార్ 2’. ఎన్టీఆర్‌కు ఇదే ఫస్ట్ బాలీవుడ్ మూవీ కావడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా… యశ్ రాజ్ ఫిల్మ్స్ తన స్పై యూనివర్స్‌‌లో భాగంగా ఆరో చిత్రంగా దీన్ని నిర్మించారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతుంది.

కూలీ..

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కూలీ.. శ్రుతిహాసన్, సౌబిన్ సాహిర్, ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బుట్టబొమ్మ పూజాహెగ్డే ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ఈ మూవీ ఈ నెల 14న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది..

మాస్ జాతర..

టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ, శ్రీ లీల జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం మాస్ జాతర. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా… సూర్య దేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

సుందరకాండ..

టాలీవుడ్ హీరో నారా రోహిత్ చాలా కాలం తర్వాత సుందరకాండ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు..ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వం వహించగా… వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ హీరోయిన్లుగా నటించారు..

Also Read: యష్ ను అందుకే పెళ్లి చేసుకున్నా.. ఇన్నాళ్లకు బయటపెట్టిన సోనియా..

వీటితోపాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. మొత్తానికి ఆగస్టు నెల మూవీ లవర్ కి పండగ అని చెప్పాలి.. బోలెడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మీకు నచ్చిన సినిమాని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×