Star Maa Parivaram : స్టార్ మా చానల్లో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఎన్నో రకాల షోలు వస్తున్నాయి. అందులో ఈ మధ్య బాగా పాపులర్ అయిన షో లలో స్టార్ మా పరివారం షోకు మంచి క్రేజ్ ఏర్పడింది. బుల్లితెర క్రేజీ యాంకర్ శ్రీముఖి ఈ షో కి హోస్టుగా వ్యవహరిస్తుంది. ఇందులో ఎక్కువగా బుల్లితెర సీరియల్ లో నటిస్తున్న వల్లే సందడి చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ షో కి సంబంధించిన నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో ని రిలీజ్ చేశారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆ ఎపిసోడ్ కొనసాగుతుందని ప్రోమోను చూస్తే అర్థమవుతుంది. ఆ ప్రోమో ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం..
ఫ్రెండ్స్ మధ్య చిచ్చు…
ఈ వారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారని అర్థమవుతుంది. తమ బెస్ట్ ఫ్రెండ్‌తో ఈ ఎపిసోడ్‌లో సందడి చేశారు. వీళ్లకి ఓ చిన్న టాస్క్ పెట్టింది యాంకర్ శ్రీముఖి. మీ ఫ్రెండ్‌లో మీరు మార్చుకోవాలి అనుకుంటున్న విషయాన్ని కుండబద్దలు కొట్టి మరీ చెప్పమంది. దీంతో ప్రతి ఒక్కరూ తమ ఫ్రెండ్‌లో లోపాల గురించి చెప్పారు.. నటుడు బాబు మోహన్ గెస్టుగా వచ్చారు. ఈ సందర్భంగా తన బెస్ట్ ఫ్రెండ్, దివంగత కోట శ్రీనివాసరావుని బాబు మోహన్ తలుచొని భావోద్వేగానికి గురయ్యారు. మళ్లీ పుడతావు అని కన్నీళ్లు పెట్టుకున్నారు..
శోభా కుండను పగలగొట్టిన తేజా..
తమ ఫ్రెండ్ లో నచ్చిని విషయాన్ని కుండ బద్దలు కొట్టి చెప్పమని చెప్తుంది శ్రీముఖి.. మొదటగా అవినాష్ ను చెప్పేది వినవా అంటూ ఎక్స్ ప్రెస్ హరి కుండ బద్దలు కొట్టేస్తాడు. ఆ తర్వాత జబర్దస్త్ అదిరే అభిని రైటర్ శ్రీరామ్ చంద్ర కుండబద్దలు కొడతాడు. తర్వాత యశ్మీ గౌడ్ అను ఫ్రెండ్ చెప్పిన మాట వినాలి కోపాన్ని తగ్గించుకోవాలి అని కుండ బద్దులు కొడుతుంది. టేస్టీ తేజ శోభా శెట్టి కుండని బద్దలు కొట్టేస్తాడు. బిగ్ బాస్ లో తనకి ఎంత కోపం ఉన్నా కూడా ఆలోచించదు. ఏదైనా పూర్తిగా చెప్పేది వినదు సగం చెప్పగానే రెచ్చిపోతుంది. ఎదుటోళ్లు చెప్పేది జాగ్రత్తగా వినమని చెప్పండి.. సగం చెప్పగానే అరుస్తుంది..
Also Read:
బిగ్‌బాస్‌లో నామినేషన్ చేయలేకపోయా కానీ ఈడ దొరికింది నాకు..అంటూ కుండ ముక్కలు ముక్కలు చేశాడు. తేజ ఫ్రస్ట్రేషన్ చూసి శోభా అవాక్కైంది. వీడు మనసులో నా మీద ఇంత పెట్టుకున్నాడా అన్నట్లుగా శోభా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది.. చివరగా అరియానా గురించి చెప్తూ అమర్దీప్ చెబుతూ కుండ బద్దలు కొడతాడు.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ఈ ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా జరగబోతున్న ఎపిసోడ్ తొందరగా సాగుతుందని ప్రోమో అని చూస్తే అర్థమవుతుంది. ఎపిసోడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి.. ఈ షో మొదలైన కొద్ది రోజుల్లోనే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. శ్రీముఖి హోస్టుగా చేయడం వల్లే ఈ షో కి అంత క్రేజీ వచ్చిందని ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు. ఈ ఎపిసోడ్ ప్రోమో ని ఒకసారి ఇక్కడ చూసేయండి..