HBD Devi Sri Prasad: ఫిలిం ఇండస్ట్రీలో మ్యూజిక్ సెన్సేషన్ గా పేరు సొంతం చేసుకున్నారు దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad). ముఖ్యంగా ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించి సక్సెస్ అందించారు. ఒకరకంగా చెప్పాలి అంటే ఈయన మ్యూజిక్ తో సక్సెస్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అలా అద్భుతమైన బీజీఎం అందిస్తూ.. ఆడియన్స్ హృదయాలలో ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈరోజు దేవిశ్రీప్రసాద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు విషయాలతో పాటూ.. ఆస్తుల వివరాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఆశ్చర్యపరుస్తున్న దేవి శ్రీ ప్రసాద్ ఆస్తుల వివరాలు..
దేవిశ్రీప్రసాద్ ఆస్తుల వివరాల విషయానికి వస్తే.. సుమారుగా రూ.70 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా ఒక ఖరీదైన ఇల్లుతో పాటు లగ్జరీ కార్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఒక్కో సినిమాకు రూ.5కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
నేషనల్ అవార్డు కూడా..
అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన దేవి శ్రీ ప్రసాద్ కి.. రెండున్నర సంవత్సరాల కిందట అల్లు అర్జున్(AlluArjun) ‘పుష్ప’ సినిమాకి నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఇక పుష్ప సీక్వెల్ ‘పుష్ప 2’ తో మరో సంచలనం సృష్టించిన ఈయన కంగువ, కుబేర వంటి సినిమాలతో కూడా మంచి పేరు దక్కించుకున్నారు.
స్టార్ హీరోల చిత్రాలకు కేరాఫ్ అడ్రస్..
ఇకపోతే ఒక ఆరేళ్ల క్రితం దేవి శ్రీ ప్రసాద్ ఎరా ఎంతలా నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు చాలామందికి బెస్ట్ ఆల్బమ్స్ అందించారు. అంతేకాదు స్టార్ హీరోల చిత్రాలకు మొదటి ఎంపికగా దేవిశ్రీప్రసాద్ నిలిచారు. ఒక్క సినిమాకు పాట కంపోజ్ చేశాడు అంటే ఆటోమేటిగ్గా ఆ సినిమాపై హైప్ వచ్చేస్తుంది. అంతలా రాక్ స్టార్ గా కూడా పేరు తెచ్చుకున్న ఈయన మధ్యలో కాస్త డల్ అయినా.. మళ్లీ సంచలనం సృష్టిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్నారు.
దేవిశ్రీప్రసాద్ కెరియర్..
దేవి శ్రీ ప్రసాద్ బాల్యం విషయానికి వస్తే.. తండ్రి పేరు సత్యమూర్తి. తల్లి పేరు శిరోమణి. వీరిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. వీరి ఊరి పేరు రామచంద్రపురం దగ్గర వెదురుపాక. దేవిశ్రీప్రసాద్ మాండోలిన్ శ్రీనివాస్ దగ్గర మాండోలిన్ నేర్చుకున్నారు. మద్రాస్ లోని హబీబుల్లా రోడ్ లో వెంకట సుబ్బారావు స్కూల్లో ప్లస్ 2 దాకా చదువుకున్నారు. చిన్నప్పటినుంచే సంగీతం అంటే ఇష్టం ఉండడంతో ఆ వైపే అడుగులు వేశారు. అద్భుతమైన పర్ఫామెన్స్ తో.. అందరినీ మెప్పించే ఈయన సంతోషం , సినీ – మా పురస్కారాలతో పాటూ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు)లలో భాగంగా తెలుగులో సైమా ఉత్తమ సంగీత దర్శకుడు విభాగంలో అత్యధికంగా 11సార్లు నామినేట్ అయ్యి.. ఏడుసార్లు అవార్డును గెలుచుకున్నాడు.
ALSO READ:Shahrukh Khan: ఒక్క ప్రకటన.. 33ఏళ్ల కల నెరవేరింది.. సంతోషంలో షారుఖ్ ఫ్యాన్స్!