Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్”(Ustad Bhagath Singh). ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కమిట్ అయిన హరిహర వీరమల్లు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. అలాగే సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా షూటింగ్ కూడా పూర్తి కావడంతో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అయితే పవన్ పూర్తిస్థాయిలో రాజకీయాలలో బిజీ కాబోతున్నారు.
లీకైన వీడియో…
ఇకపోతే ప్రేక్షకులు తమ అభిమాన హీరో సినిమా అప్డేట్స్ తెలుసుకోవడం కోసం ఎంతో ఆత్రుత కనబరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించి ఎలాంటి చిన్న విషయం బయటకు వచ్చిన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ సినిమా షూటింగ్ లొకేషన్ నుంచి ఒక వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో భాగంగా పవన్ కళ్యాణ్ హీరోయిన్ తో మాట్లాడుతూ ఉన్నట్టు కనిపించారు. ఇలా ఈ వీడియో బయటకు రావడంతో అలర్ట్ అయిన మేకర్స్ పెద్ద ఎత్తున వార్నింగ్ ఇచ్చారు.
కఠిన చర్యలు తప్పవు…
ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) వారు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమా నుంచి లీకులు వస్తున్న నేపథ్యంలో ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడతారో అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయి అంటూ తమదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారు. అభిమాన హీరోల సినిమా విషయంలో మీ ఉత్సాహం మాకు అర్థమవుతుంది కానీ మీకు బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వాలని ఎంతో కష్టపడుతున్నాము. దయచేసి సినిమా షూటింగ్ కి సంబంధించి ఎలాంటి లీకులు చేయొద్దని ఏదైనా అప్డేట్ ఉంటే అధికారికంగా మేమే తెలియచేస్తామని మైత్రి మూవీ మేకర్స్ వారు తెలియజేశారు.
We've observed that many accounts are circulating and sharing leaked pictures from the sets of #UstaadBhagatSingh.
We understand the excitement, but kindly refrain from sharing them. We are working to give you the best experience.
Any accounts indulging in this would be…
— Mythri Movie Makers (@MythriOfficial) July 20, 2025
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇటీవల పెద్ద ఎత్తున సినిమాలు నుంచి ఇలాంటి లీకులు వస్తున్న నేపథ్యంలో నిర్మాతలు వార్నింగ్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నయనతార జంటగా నటిస్తున్న సినిమాకు సంబంధించి ఒక వీడియో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ వీడియో పై నిర్మాతలు వార్నింగ్ ఇస్తూ నోట్ విడుదల చేశారు. మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా ఉస్తాద్ విషయంలో గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా హీరోయిన్ గా నటి శ్రీ లీల(Sreeleela) సందడి చేయబోతున్నారు. శ్రీ లీల ఈ సినిమాలో రేడియో జాకీగా కనిపించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమా షూటింగ్ పనులను పరిగెత్తిస్తున్నారు.
Also Read: Nagavamshi: ప్లీజ్ జాలి చూపండి.. భూతద్దం పెట్టి తప్పులు వెతకొద్దు.. రిక్వెస్ట్ చేసిన నిర్మాత?