BigTV English

Nithya Menon: పెద్ద హీరోలతో సినిమా చేయడం వేస్ట్.. నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

Nithya Menon: పెద్ద హీరోలతో సినిమా చేయడం వేస్ట్.. నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్


Nithya Menon Shocking Comments on Big Hero Movies: నిత్మా మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం లేదు. తెలుగు, తమిళ్, మలయాళి భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించింది. తెరపై అమాయకమైన పాత్రలతో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. వెండితరపై తన అందం, అభియంతో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఇక వెండితెరపై గర్ల్ ఫ్రెండ్, ఫ్రెండ్, భార్య వంటి పాత్రలు పోషించిన మెప్పించిన నిత్యా మీనన్.. నిజ జీవితంలో చాలా బోల్డ్ గా ఉంటుందనే విషయం తెలిసిందే. ఎలాంటి విషయాన్నైనా, అభిప్రాయం ఏదైన నిర్మోహమాటం లేకుండ బయటపెడుతుంది. ఆమె నటించి కో యాక్టర్స్ లో తనకు నచ్చని అంశాలను బహిరంగంగా చెప్పేస్తుంది.

బోల్డ్ కామెంట్స్ తరచూ వార్తల్లో


ఇక సినిమాల్లో హీరోయిన్లకు ఇచ్చే ప్రాధాన్యత వారికి లభించే గుర్తింపుపై ఇప్పటికే ఎన్నోసార్లు ఊహించని కామెంట్స్ చేసింది. దీంతో ఆమె తరచూ వార్తల్లో నిలుస్తుంది. అంతేకాదు ఆయా హీరో ఫ్యాన్స్ నుంచి ట్రోల్స్, విమర్శలు కూడా ఎదుర్కొంది. తాజాగా మరోసారి నిత్యా మీనన్ హాట్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ మారింది. ఈ మధ్య ఆమె వెండితెరపై చాలా అరుదుగా కనిపిస్తుంది. సెలక్టీవ్ గా సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకు వెళుతుంది. లాంగ్ గ్యాప్ తర్వాత తలైవన్ తలైవి’ సినిమాతో ఫ్యాన్స్ ని అలరించబోతోంది. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. జూలై 25న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా మూవీ టీంతో కలిసి ఆమె ప్రమోషన్స్ లో పాల్గొంది. ఈ సందర్భంగా సినిమాలకు బ్రేక్ తీసుకోవడంపై ఆమెకు ప్రశ్న ఎదురైంది.

పెద్ద హీరోలతో నటించి తప్పు చేశా

దీనికి ఆమె స్పందిస్తూ.. కావాలనే నేను ఈ బ్రేక్ తీసుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద హీరో సినిమాలో నటించడం కంటే.. చిన్ని సినిమాల్లో నటించడమే ఉత్తమం. అగ్ర నటుల చిత్రాల్లో నటించినప్పుడు.. ఎవరో సినిమాల్లో నేను యాక్ట్ చేస్తున్నా అనే ఫీలింగ్ వస్తుంది. అదే చిన్న సినిమాలు, చిన్న హీరోల మూవీస్ అయితే హీరోయిన్లకు కూడా మంచి గుర్తింపు ఉంటుంది. పెద్ద హీరోల సినిమాల్లో నటించడం వేస్ట్ అనిపించింది. అందుకే బ్రేక్ తీసుకుంటూ నాకు నచ్చిన కథలను ఎంచుకుంటున్నా. నాకు నచ్చిన కథలు, హీరోయిన్లకు కూడా ప్రాధాన్యత ఉన్న రోల్సే ఎంచుకుంటున్నాను. అలాంటి కథలకు మాత్రమే ఒకే చెబుతున్నా. అందుకే సినిమాలకు బ్రేక్ వస్తుంది’ అని వివరణ ఇచ్చింది.

అందుకే సినిమాలకు బ్రేక్ ఇచ్చా

దీంతో నిత్యామీనన్ కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే నిత్యా మీనన్ హీరోలపై ఇలాంటి కామెంట్స్ చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మరోసారి అగ్ర నటులు, వారి సినిమాలపై హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. అలా మొదలైంది సినిమాతో నిత్యా మీనన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందే ఆమె బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. చైల్డ్ ఆర్టిస్టుగా తమిళంలో పలు సినిమాలు చేసింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఆఫర్ష్ కొట్టేసి తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాలు చేసింది. దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్ర నటిగా కొనసాగుతున్న ఆమె ఆకస్మాత్తుగా పరిశ్రమకు దూరమైంది. తన దగ్గరికి వచ్చిన ఆఫర్స్ ని రిజెక్ట్ చేస్తూ చిన్న సినిమాలకే ప్రాధాన్యత ఇస్తుంది. ప్రస్తుతం ఆడపదడప సినిమాల చేస్తూ కెరీర్ లో ముందుకు వెళుతుంది.

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×