BigTV English

Nagavamshi: ప్లీజ్ జాలి చూపండి.. భూతద్దం పెట్టి తప్పులు వెతకొద్దు.. రిక్వెస్ట్ చేసిన నిర్మాత?

Nagavamshi: ప్లీజ్ జాలి చూపండి.. భూతద్దం పెట్టి తప్పులు వెతకొద్దు.. రిక్వెస్ట్ చేసిన నిర్మాత?

Nagavamshi: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న నాగ వంశీ (Nagavamshi) ప్రస్తుతం కింగ్ డం(King Dom) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా జూలై 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే నాగవంశీ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో ఒక హీరో సినిమా విడుదల అవుతుంది అంటే తప్పనిసరిగా ఆ హీరో యాంటీ ఫ్యాన్స్ సినిమాపై బురద చల్లుతూ పెద్ద ఎత్తున నెగెటివిటీ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ నెగెటివిటీ కారణంగా సినిమాపై ఎంతో ప్రభావం చూపిస్తోందని ఇటీవల ఎంతోమంది దర్శక నిర్మాతలు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


భూతద్దంలో చూడొద్దు..

ఇకపోతే సినిమాలో చిన్న చిన్న తప్పులు దొర్లిన వాటిని భూతద్దంలో పెడుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఇలాంటి చర్యల కారణంగా సినిమా పట్ల నెగిటివ్ అభిప్రాయం ఏర్పడుతుందని నాగవంశీ తెలియజేశారు. ఈ క్రమంలోనే ప్రేక్షకులను ఉద్దేశించి ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఏదైనా ఒక సినిమా విడుదలవుతుంది అంటే కచ్చితంగా మంచి సినిమా అని భావించే భారీ స్థాయిలో డబ్బు ఖర్చు చేసి సినిమాలు చేస్తామని తెలిపారు. మేము కూడా చాలా మంచి సినిమా చేశామని జనాలు మా సినిమాల పట్ల భూతద్దం పెట్టుకొని తప్పులు వెతకకుండా ఉంటే మేము కూడా చాలా మంచి సినిమా తీశామని ఈ సందర్భంగా తెలియజేశారు.


విజయ్ సినిమాలు టార్గెట్..

ఇలా నాగ వంశీ దయచేసి సినిమాల గురించి ఎవరు తప్పులు వెతకద్దని నెగెటివిటీని స్ప్రెడ్ చేయొద్దంటూ ఈ సందర్భంగా అభిమానులను రిక్వెస్ట్ చేశారు. ఇక కింగ్ డం సినిమాలో విజయ్ దేవరకొండ(Vijay Devara konda) భాగ్యశ్రీ (Bhagya Sree) జంటగా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హీరో హీరోయిన్లు ప్రమోషన్లకు దూరంగా ఉన్న నాగ వంశీ మాత్రమే వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.. ఇకపోతే గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ సినిమాలు అంటేనే ఓవర్గానికి చెందినవారు విజయ్ సినిమాలను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

కింగ్ డం పైనే ఆశలు…

సినిమా విడుదలకు ముందు నుంచి కూడా విజయ్ సినిమాలపై విమర్శలు చేస్తూ భారీ స్థాయిలో నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నాగ వంశీ ప్రేక్షకులను ఈ విధంగా రిక్వెస్ట్ చేశారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా గౌతమ్ తిన్ననూరి(Gautham tinnanuri) దర్శకత్వంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. యాక్షన్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టం అవుతుంది. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఎంతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ అలాగే ఆయన అభిమానులందరికీ కూడా ఈ సినిమా పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి కింగ్ డం సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: Ravi Kishan: రాత్రి ఆ పని చేయనిదే నిద్రపోను.. ఎమోషనల్ అయిన బన్నీ విలన్?

Related News

Actor Satya Dev: మూడ్ సరిగ్గా లేకపోతే చేసేది ఆ పనే… వ్యసనంలా మారిపోయిందంటున్న సత్య దేవ్!

Ntr Dragon: తారక్‌కు క్లైమాక్స్ ఇచ్చేశాడు… నీల్ మావా ప్లాన్ మామూలుగా లేదుగా

Ankita Singh: 3 లక్షలు ఇస్తే 15 నిమిషాలు టైం ఇస్తా… హీరోయిన్ ఓపెన్ ఆఫర్

Lokesh Kanagaraj: నటుడుగా లోకేష్ కనగరాజ్, అందుకే ఇన్ని గెటప్స్

Samantha: నా కొత్త సినిమా ఆగిపోలేదు, షూటింగ్ అప్పుడే మొదలవుతుంది

Rashmika: రష్మికపై డబ్బులిచ్చి ట్రోలింగ్ చేయిస్తుంది ఎవరు.. ?

Big Stories

×