Bumrah wife : టీమిండియా క్రికెటర్ జస్ప్రిత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బుమ్రా బౌలింగ్ వేస్తున్నాడంటే ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ కి ధడా పుట్టాల్సిందే. బుమ్రా వేసే యార్కర్లకు బ్యాట్స్ మెన్ బెంబేలెత్తుతాడు. బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడంటే ఆ ఓవర్ కట్టడి చేస్తాడనే నమ్మకం ఉంటుంది. అది టెస్ట్ అయినా, వన్డే అయినా, టీ-20 అయినా ఏ మ్యాచ్ లో బుమ్రా బౌలింగ్ చేస్తాడో.. ఆ మ్యాచ్ కి తగ్గట్టు చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల సోషల్ మీడియాలో ఆస్ట్రేలియా బౌలర్లు స్టార్క్, కమిన్స్, హెజెల్ వుడ్ లను బుమ్రా తో పోల్చి టీ-20 లకు ఒకరు, వన్డేలకు ఒకరు, టెస్ట్ లకు ఒకరు ఆస్ట్రేలియా స్పెషల్.. కానీ టీమిండియా కి మాత్రం కేవలం బుమ్రా ఒక్కడే స్పెషల్.. ఏ మ్యాచ్ అయినా సరే అలా రాణిస్తాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం బుమ్రాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Sarfaraz Khan Father : 22 కిలోలు తగ్గిన సర్ఫరాజ్ తండ్రి.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే !
మాజీ ప్రియుడికి కిస్.. వైరల్
బుమ్రా భార్య సంజనా గణేశన్ తన మాజీ ప్రియుడు అశ్విన్ కౌల్ ను కిస్ చేసిన పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్రికెటర్ బుమ్రా తో పెళ్లి జరిగిన తరువాత ఇది ఏంటి..? అని చర్చించుకోవడం విశేషం. వాస్తవానికి 2014లో జరిగిన ఈ ఘటన.. మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. బుమ్రా కి ఆయన భార్య వెన్ను పోటు పొడిచిందని.. పెళ్లి తరువాత ఇలా చేయడం ఏంట్రా బాబు అని రకరకాలుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే.. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ-2025 విజేతగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ కి బుమ్రా వెన్నునొప్పి కారణంగా దూరమైన విషయం తెలిసిందే. అయితే అతని సతీమణీ సంజనా గణేషన్ తో కలిసి బుమ్రా దుబాయ్ కి వెళ్లాడు. కెప్టెన్ రోహిత్ శర్మను ఇంటర్వ్యూ చేసిన సంజనా ట్రోఫీతో కలిసి ఫోజులిచ్చింది.
టీమిండియా కీలక బౌలర్ గా బుమ్రా..
బుమ్రా ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరిగే 5 టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు. అయితే తొలి టెస్టులో ఆడిన బుమ్రా.. రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆడలేదు. మూడో టెస్టులో ఆడాడు. బుమ్రా ఆడిన రెండు టెస్టుల్లో టీమిండియా ఓడిపోవడం గమనార్హం. టీమిండియా ఇంగ్లాండ్ పై 2-1 తేడాతో వెనుకంజలో ఉంది. సిరీస్ ని కైవసం చేసుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచ్ లకు రెండింటిలో విజయం సాధిస్తేనే సిరీస్ విజయం సాధిస్తుంది. ఇంగ్లాండ్ జట్టు రెండు మ్యాచ్ ల్లో కేవలం ఒక్క మ్యాచ్ లో గెలిస్తే.. సిరీస్ కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది. మూడో టెస్టులో గెలవాల్సిన టీమిండియా బ్యాటర్లు తడబడి వికెట్ల ను కోల్పోయారు. దీంతో టీమిండియాకి ఓటమి తప్పలేదు. కచ్చితంగా గెలవాల్సిన రెండు మ్యాచ్ ల్లో బుమ్రా కీలక బౌలర్ గా ఉండనుండటం విశేషం.
?igsh=NnMzeWdudnlnNzlw