Mirai Movie : ఈ నెలలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మిరాయి మేనియా కొనసాగుతుంది.. ఈనెల 12న థియేటర్లలోకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. ఒకవైపు పాజిటివ్ టాక్ దూసుకుపోవడంతో పాటు మరోవైపు కలెక్షన్లు కురిపిస్తుంది. కేవలం మూడు రోజుల్లోనే 70 కోట్ల వరకు వసూలు చేయడం మామూలు విషయం కాదు. అయితే సినిమా మంచి సక్సెస్ ని అందుకుంది. కానీ.. ఈ మూవీ స్టోరీని ఓ సినిమాను మక్కికి మక్కి దించేసారని వార్తలు వినిపిస్తున్నాయి.. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ఇలాంటి వార్త నిరాశను మిగుల్చింది. మరి ఏ సినిమాను కాపీ కొట్టారో ఒకసారి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా, రితికా నాయక్ జోడిగా నటించగా.. యంగ్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. మంచు మనోజ్, శ్రియ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ కలెక్షన్స్ కూడా భారీగానే వసూల్ అవుతున్నాయి. ఇలాంటి టైం లో ఈ సినిమా పాత సినిమాను కాపీ కొట్టారంటూ వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. 1969లో విడుదలైన కృష్ణ నటించిన మహాబలుడు కథానికే మక్కీకి మక్కీగా మిరాయ్ తీశారని ఆరోపించారు ఓ నెటిజన్.. అంతేకాదు ఓ వీడియో కూడా షేర్ చేశాడు. దాంతో ఈ మూవీ ని కాపీ కొట్టారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఈ చిత్ర యూనిట్ రెస్పాండ్ అయ్యేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..
Also Read: శునకంతో కలిసి చెమటలు చిందిస్తున్న హాట్ బ్యూటీ.. నెటిజన్స్ దారుణమైన ట్రోల్స్..
హనుమాన్ మూవీతో భారీ విజయాన్ని అందుకున్న తేజా సజ్జా ఇప్పుడు మిరాయ్ మూవీతో అలాంటి హైప్ ను క్రియేట్ చేశాడు. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ ని అందుకోవడంతోపాటుగా రోజురోజుకీ కలెక్షన్లు పెరుగుతూ వస్తున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే 68 కోట్లకు పైగా వసూలు చేసింది. నాలుగు రోజులకు మరో 15 కోట్ల వరకు వసూలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కలెక్షన్ల గురించి ఆ చిత్ర యూనిట్ వెల్లడించలేదు. మొత్తానికి ఈ మూవీ అతి తక్కువ కాలంలోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చివరికి ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి..
ఈ సినిమాపై తేజా ఆశలు పెట్టుకున్నాడు.. మొదటినుంచి భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా థియేటర్లను వచ్చిన తర్వాత అంతకుమించి టాక్ని అందుకుంది.. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాతో మరోసారి తన ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడిపోయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత జాంబిరెడ్డి 2 లో నటించబోతున్నట్లు ఇటీవలే వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ తర్వాత జై హనుమాన్, మిరాయ్ 2 మూవీ కూడా చెయ్యనున్నట్లు సమాచారం..
మిరాయ్ సినిమా చాలా అద్భుతంగా తీశారు. కానీ సినిమా మొత్తం చూస్తే 18/04/1969 హీరో కృష్ణ నటించిన మహాబలుడు సినిమాని మక్కీకి మక్కీ దించినట్టు కనబడడంలో ఆశ్చర్యం లేదనిపిస్తుంది. సినిమా లింక్ https://t.co/IoMlGzL3ob
— Ravi Vallabhaneni (మహానాడు 2025) (@ravivallabha) September 14, 2025