E-Paper
Advertisement

Celebrities Alimony: సినిమా ఇండస్ట్రీలో భరణం ఆశించకుండా విడిపోయిన సెలబ్రెటీస్ వీరే!

Celebrities Alimony: సినిమా ఇండస్ట్రీలో భరణం ఆశించకుండా విడిపోయిన సెలబ్రెటీస్ వీరే!
Advertisement

Celebrities Alimony:సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత గ్రాండ్‌గా జరుగుతాయో, కొన్నిసార్లు విడిపోవడాలు కూడా అంతే చర్చనీయాంశం అవుతుంటాయి. సాధారణంగా స్టార్ హీరోయిన్లు విడాకులు తీసుకుంటే వందల కోట్ల భరణం (Alimony) తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంటుంది. కానీ, మన ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు మాత్రం తమ ఆత్మగౌరవాన్ని చాటుకున్నారు. రూపాయి కూడా భరణం ఆశించకుండా, తమ స్వశక్తితో నిలబడి నేటి తరం మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అటు సమంత (Samantha)నుంచి ఇటు నిహారిక (Niharika)వరకు ఆ జాబితాలో ఉన్న ప్రముఖుల గురించి ఇప్పుడు చూద్దాం.

సమంత, నిహారిక – ఆత్మగౌరవంతో కూడిన నిర్ణయం:

టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత, నాగచైతన్య 2017లో పెళ్లి చేసుకుని 2021లో విడిపోయారు. ఆ సమయంలో సమంతకు రూ. 200 కోట్ల భరణం ఆఫర్ వచ్చినా ఆమె నిరాకరించి తనకంటూ ఒక సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇక మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా ఇదే బాటలో నడిచింది. చైతన్య జొన్నలగడ్డతో వివాహం తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయిన నిహారిక, భరణం తీసుకున్నారంటూ కొందరు అనుకున్నప్పటికీ ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.ఇక ప్రస్తుతం ఆమె నిర్మాతగా, నటిగా తన కెరీర్‌లో ఫుల్ బిజీగా గడుపుతూ స్వశక్తితో రాణిస్తోంది.

హన్సిక, అమలా పాల్, ఐశ్వర్య – కొత్త ప్రయాణం:

Advertisement

హన్సిక మోత్వాని తన స్నేహితుడు సోహైల్ కతూరియాను 2022లో పెళ్లాడి, ఏడాది తిరగకముందే గ్రేస్‌ఫుల్‌గా ఆ బంధం నుంచి బయటకు వచ్చింది. నటి అమలా పాల్ కూడా దర్శకుడు విజయ్‌తో విడిపోయినప్పుడు కోర్టులో ఎటువంటి భరణం కోరలేదు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, హీరో ధనుష్ 18 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. వీరు కూడా ఎటువంటి ఆర్థిక డిమాండ్లు లేకుండా, తమ పిల్లల భవిష్యత్తు కోసం స్నేహపూర్వకంగా విడిపోయారు. ఐశ్వర్య ప్రస్తుతం దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.

ALSO READ:Varalakshmi Sarathkumar: పిల్లలపై వరలక్ష్మీ ఊహించని కామెంట్స్.. ఆర్థికంగా ఎవరూ సహాయం చేయరంటూ?

భరణం కాదు ఆత్మగౌరవమే ముఖ్యం..

Advertisement

ఈ హీరోయిన్లందరూ నిరూపించింది ఒక్కటే.. బంధం ముగిసినప్పుడు ఆర్థిక లాభాల కంటే ఆత్మగౌరవమే ముఖ్యమని. సమాజం రకరకాలుగా మాట్లాడుకున్నా, స్వశక్తితో నిలబడి నేటి తరం మహిళలకు ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రేమలో విఫలమైనా, జీవితంలో గెలవచ్చని వీరి ప్రయాణాలు నిరూపిస్తున్నాయి. భరణం ఆశించకుండా విడిపోయిన ఈ తారల నిర్ణయం నిజంగా అభినందనీయం.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×