E-Paper
Advertisement

వారసుల కొంపముంచుతున్న వశిష్ట? ‘రామ్ చరణ్’ కి హ్యాండ్ ఇచ్చి.. ‘మోక్షజ్ఞ’ ను పక్కనపెట్టి.. ఏం జరుగుతోంది?

వారసుల కొంపముంచుతున్న వశిష్ట? ‘రామ్ చరణ్’ కి హ్యాండ్ ఇచ్చి.. ‘మోక్షజ్ఞ’ ను పక్కనపెట్టి.. ఏం జరుగుతోంది?
Advertisement

Vassishta Stories : ఒక హీరోకోసం రాసిన కథలు మరో హీరో దగ్గరికి చేరడం ఇండస్ట్రీ కామన్. కానీ కొడుకుల కోసం రాసిన కథలే తండ్రుల దగ్గరికి చేరడమే ఇక్కడ వెరైటీ. విషయంలోకి వెళ్తే బింబిసారతో మినిమం బడ్జెట్ లోనే సాలిడ్ హిట్ కొట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు వశిష్ట. అయితే ప్రస్తుతం తను కొడుకుల కోసం రాసిన కథలు తండ్రుల ఖాతాలోకి వెళ్తున్నాయనే నెగెటివ్ సెంటి మెంట్ ఆయన చుట్టూ తెగ చక్కర్లు కొడుతుంది. అవును కథలు రాయడం తెలిసిన వశిష్ట అవి ఎవరికీ సెట్ అవుతాయో మాత్రం తెల్చుకోలేకపోతున్నాడట.

వీరి పేరు చెప్పి వాళ్ళ డేట్స్ పట్టేస్తున్నాడా

Advertisement

అయితే ఆయన నిజంగానే యంగ్ హీరోస్ కోసం కథలు రాస్తున్నారా లేక వీరి పేరు చెప్పి వాళ్ళ డేట్స్ పట్టేస్తున్నాడా అన్న నెగెటివ్ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యంగా నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు వెళ్లి కల్లత్జో ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సింబా అంటూ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ అయింది కూడా. కానీ కారణాలేవైనా ఈ సినిమా మొదలుకాకుండా నే ఆగిపోయింది. ఇక అప్పటి నుండి అదిగో కథ అంటే ఇదిగో సినిమా అన్నట్టుగా వార్తలు వినబడటమే కాని ఏదీ సెట్స్ పైకి వెళ్ళని పరిస్థితి.ఇక బాలయ్య ఒకానొక సంధర్భంలో ఆదిత్య 999 క్రిష్ డైరెక్షన్ లో ఉంటుందని హింట్ ఇవ్వడంతో ఇందులో నైనా మొక్షు ఉండే ఛాన్స్ ఉండొచ్చు అన్న రూమర్స్ చక్కర్లు కొట్టాయ్. అయితే అవన్నీ పక్కకి పోగా తాజాగా వశిష్ట చెప్పిన ఒక అద్భుతమైన సోషియో ఫాంటసీ లైన్ బాలయ్యకు, మోక్షజ్ఞకు బాగా నచ్చిందన్న టాక్ రావడంతో మోక్షజ్ఞ లాంచ్ ఫిక్స్ అని తెగ మురిసిపోయారు బాలయ్య ఫ్యాన్స్.

also read :5 కోట్లు పెడితే రూ. 180 కోట్ల వర్షం.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న మలయాళ సెన్సేషన్!

Advertisement

సీనియర్ హీరోతో సేఫ్ గేమ్

కట్ చేస్తే ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయినట్టే కనిపిస్తుంది. వారసుడి లాంచింగ్ పక్కన పెట్టి అదే వశిష్ట డైరెక్షన్ లో మన నటసింహం ఓ భారీ ప్రాజెక్ట్ ని చేయడానికి సిద్ధం అయ్యారని ఇన్ సైడ్ టాక్. ఒక రకంగా మోక్షు ఎంట్రీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఇది పెద్ద షాకే. ఇక కొడుకుని లాంచ్ చేయడం కంటే తన సినిమానే ముఖ్యం అన్నట్టుగా బాలయ్య వ్యవహరించడం ఏం బాగాలేదన్నది వాళ్ళ వాదన. మరో వైపు వశిష్ట కూడా మోక్షజ్ఞతో రిస్క్ చేయడం కంటే సీనియర్ హీరోతో సేఫ్ గేమ్ ఆడాలని చూస్తున్నారా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయ్.

చరణ్‌కు చెప్పే ప్రాసెస్లో చిరు సీన్ లోకి ఎంట్రీ

ఇక గతంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరగడం ఈ నెగెటివ్ రూమర్స్ కి మాంచి బూస్టప్ ఇస్తుంది. రామ్ చరణ్ కి ఉన్న గ్లోబల్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఒక భారీ విజువల్ వండర్‌ను సిద్ధం చేసుకున్నాడట వశిష్ట. కానీ ఆ కథను చరణ్‌కు చెప్పే ప్రాసెస్లో చిరు సీన్ లోకి ఎంట్రీ ఇవ్వడం, కట్ చేస్తే ఆ సినిమా ‘విశ్వంభర’గా సెట్స్ పైకి వెళ్ళిపోవడం చకచకా జరిగిపోయానని టాక్. ఇక ఇదే విషయమై ఫ్యాన్స్ కూడా అప్పట్లోనే డిసప్పాయింట్ అయ్యారట కూడా.

ఇక తాజాగా అదే పరిస్థితి బాలయ్య – మొక్షు విషయంలో రిపీట్ అవడంతో అసలు తన కథలకి ఏ హీరో కావాలన్న క్లారిటీ వశిష్ట కి ఉంటె ఇలా ఒకరి కథల్లోకి మరొకరి ఎంట్రీ ఇవ్వరుగా అంటూ కామెంట్స్ వదులుతున్నారు సోషల్ మీడియా వారియర్స్. చూడాలి మరి విశ్వంభర తరువాత వశిష్ట చేయబోయేది బాలయతోనైనా లేదా అని. అయితే ఇప్పటికే అర డజన్ డైరెక్టర్ ని లైన్లో పెట్టిన బాలయ్య వశిష్టకి డేట్స్ ఎలా సర్దుబాటు చేస్తాడో మరి!

also read :సీతమ్మగా సాయి పల్లవి.. 4000 కోట్ల ‘రామాయణ’లో ఆమె రెమ్యూనరేషన్ ఇంత తక్కువా?

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×