BigTV English

Venkatesh: చిరు సినిమాలో వెంకటేష్.. పాత్రపై కూడా క్లారిటీ ఇచ్చిన వెంకీ మామ!

Venkatesh: చిరు సినిమాలో వెంకటేష్.. పాత్రపై కూడా క్లారిటీ ఇచ్చిన వెంకీ మామ!

Venkatesh: ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోలు సింగిల్ గా కాకుండా మల్టీ స్టారర్ గా నటించడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సీనియర్ హీరోలలో చిరంజీవి (Chiranjeevi) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలలో చాలావరకు మరో హీరోకి కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇదివరకే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో రవితేజ (Ravireja) కు అవకాశం కల్పించి, ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వస్తున్న ‘మెగా 157’ సినిమాలో వెంకటేష్ కి అవకాశం కల్పించినట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇది రూమర్ అంటూ కొంతమంది కొట్టి పారేసినా.. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు వెంకటేష్.


నాట్స్ – 2025లో సినిమా లైనప్ చెప్పేసిన వెంకటేష్..

తాజాగా యూఎస్ లో ఘనంగా జరిగిన నాట్స్ – 2025 లో వెంకటేష్ సందడి చేశారు. అందులో భాగంగానే తన సినిమాల గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం ఆయన వెల్లడించిన తన సినిమాల లిస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇకపోతే ఎన్నో రోజులుగా చిరంజీవి సినిమాలో వెంకటేష్ కనిపించబోతున్నారు అంటూ వార్తలు రాగా.. ఇప్పుడు ఆ విషయాన్ని వెంకటేష్ అధికారికంగా ప్రకటించారు. ఆ పాత్ర ఎలా ఉంటుందో కూడా చెప్పుకొచ్చారు..ఈవెంట్ లో భాగంగా అమెరికాలో ఉంటున్న తెలుగు అభిమానులను పలకరించిన వెంకటేష్ తన సినిమాల గురించి కూడా తెలిపారు.


చిరంజీవి సినిమాలో వెంకటేష్.. క్లారిటీ ఇచ్చేసారుగా..

వెంకటేష్ మాట్లాడుతూ..” మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఒక ప్రాజెక్టు చేస్తున్నాను. అలాగే చిరంజీవి సినిమాలో కూడా అతిథి పాత్ర పోషిస్తున్నాను. ఈ పాత్ర చాలా ఫన్నీగా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఆ పాత్ర ఉంటుంది. అంతేకాదు ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది. ఈ రెండు చిత్రాలతో పాటు మీనాతో కలిసి దృశ్యం సినిమాలో కూడా నటిస్తున్నాను. ఇటీవల హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మరోసారి మీ ముందుకు రాబోతున్నాను. వీటన్నిటితో పాటు నా స్నేహితుడితో కలిసి మరో భారీ ప్రాజెక్టులో నటిస్తున్నాను” అంటూ వెంకటేష్ తెలిపారు. అయితే తన స్నేహితుడు ఒక పెద్ద స్టార్ అని చెప్పడంతో ఇప్పుడు మరో సరికొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ హీరో ఎవరు? ఏ జానర్లో సినిమా చేస్తున్నారు? అనే వార్తలు కూడా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

వెంకటేష్ సినిమాలు..

ఇక వెంకటేష్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేశారు. ఈ సినిమా మంచి విషయాన్ని అందుకోవడమే కాకుండా ప్రాంతీయంగా రూ.300 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెట్టారు వెంకటేష్. అటు చిరంజీవి మెగా 157 అనే వర్కింగ్ టైటిల్స్ సినిమా చేస్తున్నారు. ఇందులో శివశంకర్ ప్రసాద్ గా డ్రిల్ మాస్టర్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఇక అంతేకాదు ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ నయనతార కూడా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

ALSO READ:Rashmika Mandanna: ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది.. ఒక్కోసారి ఏడ్చేస్తాను కూడా -రష్మిక మందన్న

 

Related News

Mirai Heroine : రితికా నాయక్ రిస్కీ స్టెప్… అసలు మూవీలో ఆమె యాక్టింగే లేదు!

Kishkindhapuri Collection : హీరో బెల్లం మూవీ బిగ్ ఫెయిల్యూర్… ఫస్ట్ డే దారుమైన కలెక్షన్లు..

Manchu Manoj :అన్నదమ్ములు కలిసిపోయారు… మంచు వారి ఇంటి పొంగిపోతున్న ప్రేమలు!

Mirai Day 1 Collections : ‘మిరాయ్’ కలెక్షన్లు.. మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

Prabhas in Mirai : అది డార్లింగ్ వాయిస్ కాదు.. ఎంత మోసం చేశారయ్యా ?

Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ పై రష్మిక క్లారిటీ!

Raja Saab : ప్రభాస్ ‘ రాజాసాబ్ ‘ కు అక్కడ పోటీ తప్పట్లేదే..?

Tamannaah: అలాంటి వాడే భర్తగా రావాలంటున్న మిల్కీ బ్యూటీ.. అందుకే లవ్ ఫెయిల్యూరా?

Big Stories

×