BigTV English

Kuberaa OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన కుబేర.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?

Kuberaa OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన కుబేర.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?

Kuberaa OTT:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) తెలుగులో నేరుగా చేసిన మరో చిత్రం కుబేర (Kuberaa). శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో సీనియర్ హీరో నాగార్జున (Hero Nagarjuna) మరో కీలకపాత్రలో వచ్చిన చిత్రం ఇది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika mandanna) హీరోయిన్ గా నటించింది.ఒక భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.పైగా ఈ సినిమాలో బిచ్చగాడి పాత్రలో ధనుష్ ఒదిగిపోయారు .శేఖర్ కమ్ముల మేకింగ్ పై కూడా విమర్శకులు ప్రశంసలు కురిపించారు. దీనికి తోడు నాగార్జున మొదటిసారి ఒక విభిన్నమైన పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ప్రముఖ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) ఈ సినిమాకి సంగీతం అందించగా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమా విజయానికి కారణం అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ఇప్పటికీ దూసుకుపోతూ ఉండడం గమనార్హం.


ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన కుబేర..

సినిమాను థియేటర్లలో చూడలేని ఆడియన్స్ ఓటీటీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ సినిమా ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కుబేర హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. అంతేకాదు త్వరలోనే ఓటీటీలోకి కూడా రాబోతుందని తెలుస్తోంది. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా ఓటీటీ హక్కులను రూ.50 కోట్లకు సొంతం చేసుకుందని సమాచారం. జూలై 20న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.


కుబేర టోటల్ కలెక్షన్స్..

జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా అమీగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమా, ఎల్ ఎల్ పి బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమాని సునీల్ నారాయణ్, పుష్కర రామ్మోహన్రావు ప్రొడ్యూసర్లుగా తెరకెక్కించారు. ఇకపోతే బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో పాటు సినిమా క్లోజింగ్ కలెక్షన్స్, ఎలాంటి లాభాలను కొల్లగొట్టింది అనే అంశాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే రూ.145 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెప్పగా.. అందులో ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా రూ.65 కోట్ల మేరా జరిగింది. ఈ సినిమాకు 66 కోట్ల షేర్, 132 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వస్తేనే సినిమా లాభాల్లోకి వెళ్తుందని ట్రేడ్ వర్గాలు కూడా చెప్పాయి. కానీ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకు పైగా కలెక్షన్లు దక్కించుకున్నట్లు సమాచారం.

ALSO READ:Venkatesh: చిరు సినిమాలో వెంకటేష్.. పాత్రపై కూడా క్లారిటీ ఇచ్చిన వెంకీ మామ!

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×