Rashmika Mandanna: నేషనల్ క్రష్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రష్మిక మందన్న (Rashmika Mandanna).. ఈ మధ్యకాలంలో మరింత పాపులారిటీ అందుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి భారీ పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మూడేళ్లలోనే రూ.3000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి తన సినిమాలతో రికార్డు సృష్టించింది. ముఖ్యంగా పుష్ప, పుష్ప 2, ఛావా, కుబేర సినిమాతో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా స్టార్ హీరోలకి కూడా సాధ్యం కాని సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఇప్పటికీ కూడా వరుస పెట్టి అవకాశాలందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది రష్మిక మందన్న.
ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది – రష్మిక మందన్న
ఇదిలా ఉండగా.. తాజాగా రష్మికకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాదు ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది కూడా. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” నేను నా సెలవు రోజుల కోసం ఏడుస్తున్నాను. నాకు.. నా కంటే 16 సంవత్సరాల చిన్నది అయినా ఒక సోదరి ఉంది. ఆమె ఆలనా పాలనా చూసుకోలేకపోతున్నాను. నేను ఒకటిన్నర సంవత్సరములుగా ఇంటికి వెళ్ళలేదు. నా స్నేహితులను, కుటుంబాన్ని మిస్ అవుతున్నాను. దీనికి తోడు నా చెల్లి ఆలనా పాలన చూసుకోలేక పోయాను అనే బాధ ఎప్పటికీ ఉంటుంది. అందుకే ఆమెతో గడపడానికి సెలవులు కావాలి. ఆ సెలవు లేకపోవడం వల్లే బాగా ఏడ్చేస్తాను” అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
రష్మిక మందన్న సినిమాలు..
‘ఛలో ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మందన్న మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తో కలిసి ‘గీతాగోవిందం’ సినిమా చేసి హోమ్లీ హీరోయిన్ గా పేరు అందుకుంది. అలా తన నటనతో దర్శక నిర్మాతలను ప్రేక్షకులను మెప్పిస్తున్న రష్మిక మందన్నకి ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu ) ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అలా ఆ సినిమాతో మళ్ళీ తన టాలెంట్ ను నిరూపించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమా తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకునే ప్రయత్నం చేసింది రష్మిక. ఇక ఇప్పుడు అందులో భాగంగానే ఆ ప్రయత్నమే ఆమెను స్టార్ స్టేటస్ కి దగ్గర చేసింది.. స్టార్ హీరోలు కూడా అందుకోలేని ఘనతను సాధించి రికార్డు సృష్టించింది. ఇక ప్రస్తుతం రెయిన్బో తో పాటు మరికొన్ని చిత్రాలలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఏదేమైనా రష్మిక మందన్న ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఈ స్థాయిలో స్టేటస్ సొంతం చేసుకోవడం నిజంగా ప్రశంసనీయమని చెప్పవచ్చు.
ALSO REA: Renu Desai: రెండో పెళ్లికి సిద్ధమైన రేణూ దేశాయ్.. మళ్లీ మెలిక పెట్టిందే?