BigTV English

Venkatesh – Trivikram : వెంకీ – త్రివిక్రమ్ మూవీ ప్రారంభం.. రెగ్యులర్ షూట్ అప్పుడే..?

Venkatesh – Trivikram : వెంకీ – త్రివిక్రమ్ మూవీ ప్రారంభం.. రెగ్యులర్ షూట్ అప్పుడే..?

Venkatesh – Trivikram : ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరితో సినిమాలు తెరకెక్కించారు. మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేశారు. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ స్టోరీలో మార్పులు ఉండటం తో అట్లీతో మూవీ చేసేందుకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ వెంకీ తో మూవీ చేయబోతున్నాడు. ఆ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఇవాళ పూర్తి చేసినట్లు తెలుస్తుంది. మరి రెగ్యులర్ షూట్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో? ఈ మూవీ కాస్ట్ గురించి తెలుసుకుందాం..


‘వెంకటరమణ’ షూటింగ్ స్టార్ట్..

హీరో వెంకటేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఇప్పటివరకైతే మూవీలు రాలేదు.. కానీ నువ్వు నాకు నచ్చవ్ , మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ రచయితగా , స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేశాడు. ఈ మూవీలు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను అందుకున్నాయి. వెంకీ , త్రివిక్రమ్ కాంబో మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇవాళ అ వార్తలకు ఆజ్యం పొసేలా పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు. తాజాగా ఈ మూవీకి కొబ్బరికాయ కొట్టేశారు. చిత్ర యూనిట్ తో పాటు పలువురు ప్రముఖులు ఈ పూజా కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తుంది. అయితే ఈ పూజకు సంబంధించిన వీడియోలను ఫోటోలను ఇంతవరకు టీం బయటకు వెల్లడించలేదు. మరి కాసేపట్లో ఆ ఫోటోలు వీడియోలు బయటికి వచ్చే అవకాశం ఉంది.


Also Read : ‘కూలీ’ కన్నా ‘వార్ 2’ కలెక్షన్స్ అంత తక్కువా.. వీకెండ్ కలిసివస్తుందా..?

విశాఖ నేపథ్యంలో స్టోరీ.. 

త్రివిక్రమ్ సినిమాలంటే ఒక మార్క్ ఉంటుంది. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం కనిపించేలా ఉంటుంది. గత ఏడాది గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుని స్పెషల్గా చూపించారు. ఇక వెంకటేష్ తో చేయబోతున్న సినిమాలో వెంకటేష్ గతంలో ఎన్నడు కనిపించని పాత్ర లో కనిపించబోతున్నాడు అంటూ ఓ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో కోడైకూస్తుంది.. ఇకపోతే ఈ సినిమాకు వెంకటరమణ అనే టైటిల్ ని ఫిక్స్ చేసే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు నెట్టింట ప్రచారంలో ఉంది.. ఈ సినిమా కథ పూర్తిగా విశాఖపట్నం నేపథ్యంలో సాగబోతుంది అని ఓ వార్త వైరల్ అవుతుంది. అలాగే విశాఖపట్నం లోని మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన 50 ఏళ్ల వ్యక్తి కథగా ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.. మరి వెంకీ ఇందులో ఎలా కనిపిస్తా డో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.. వెంకీ ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఈ మూవీతో మరో హిట్ ను సొంతం చేసుకుంటాడేమో చూడాలి..

Related News

Chiranjeevi: మెగా 158 లో ప్రభాస్ హీరోయిన్.. బాబీ ఎంపిక సరైనదేనా?

Mass Jathara: మాస్ మహారాజ్ తో రచ్చ చేసిన హైపర్ ఆది, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్

OG success Meet : స్టార్ హోటల్ లో ఓజి సక్సెస్ ఈవెంట్, 12 ఏళ్ల తర్వాత ఆ మూమెంట్ 

Actor Darshan: దర్శన్‌కు మొత్తటి పరుపు ఇవ్వండి… కోర్టులో విచారణ

OG 2 shooting: ఓజీ 2 షూటింగ్ పై బిగ్ అప్డేట్… పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్!

OG Movie: ఓజి సినిమాపై మెగాస్టార్ రివ్యూ… హాలీవుడ్ కు ఏమాత్రం తగ్గలేదంటూ!

I Bomma : పైరసీ సైట్ ఐబొమ్మకు ఇక మూడినట్టే… నలుగురు అరెస్ట్

Tollywood : ఇండస్ట్రీ బాగు కోసం… టాలీవుడ్ పిల్లర్ బాలకృష్ణ ఎక్కడా ?

Big Stories

×