Venky Trivikram : కొన్ని కాంబినేషన్స్ వినగానే విపరీతమైన క్యూరియాసిటీ పెరిగిపోతుంది. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా చేయడం ఒకటి. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు దర్శకుడు హీరోగా పని చేయలేదు. కానీ రచయిత హీరోగా పని చేశారు. అలా పని చేయడం వల్లే విపరీతమైన ఇంపాక్ట్ కలిగింది. అలాంటిది వెంకటేష్ సినిమాకు త్రివిక్రమే దర్శకుడు అయితే.?
స్వయంవరం సినిమా మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రచయితగా ఎంట్రీ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి పేరును సాధించుకున్నాడు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటగా పనిచేసిన స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. నువ్వు నాకు నచ్చావ్ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ కి విపరీతమైన పేరును తీసుకొచ్చింది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చూడటానికి చాలామంది ఎదురుచూస్తున్నారు.
సినిమా అనౌన్స్ చేయలేదు
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ సినిమా చేస్తారు అని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఒక తరుణంలో నాని కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ తో పాటు నటిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు. త్రివిక్రమ్ నితిన్, తరుణ్ మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ కూడా స్టార్ హీరోలతోనే చేశారు. ఇక వెంకటేష్ కామెడీ టైమింగ్ కి త్రివిక్రమ్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతారు అని ప్రూవ్ చేసిన సినిమాలు నువ్వు నాకు నచ్చావు మరియు మల్లీశ్వరి. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా చేస్తాడు అని వార్తలు ఎప్పటినుంచి వస్తున్నాయి. కానీ దాని గురించి అధికార ప్రతి ప్రకటన రాలేదు. దానికోసం కూడా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ చేయబోయే సినిమా గురించి అధికారిక ప్రకటన రాకపోయినా కూడా, నిర్మాత నాగ వంశి రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కంప్లీట్ క్లారిటీ ఇచ్చాడు. సంక్రాంతికి మా నుంచి ఏ సినిమా ఉండకపోవచ్చు కానీ నాకున్న పెద్ద సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్నది. ఆ సినిమా సమ్మర్ కి ప్లాన్ చేస్తున్నాము అన్నట్లు మాట్లాడారు. దీన్ని బట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా చేస్తున్నట్లు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే. ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వేచి చూడాలి. ఏదేమైనా ఇప్పటికీ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ బెస్ట్ వర్క్ అంటే చెప్పేది నువ్వు నాకు నచ్చావ్ సినిమా గురించి. అలాంటిది త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ పని చేస్తున్నారు అంటే ఆ అంచనాలే వేరే స్థాయిలో ఉన్నాయి. కానీ గురూజీ దానిని ఎంతవరకు నిలబెడతారు అనేది టాస్క్. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో త్రివిక్రమ్ రాసిన సినిమాలేవి రచనాపరంగా ఆకట్టుకోలేదు అనేది వాస్తవం.
Also Read : Hari Hara Veeramallu: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్, సినిమా ఫలితం ముందే తెలిసిపోతుంది