BigTV English

Am Ratnam: మీరు కోట్లు కుమ్మరించారు కదా అని, ప్రేక్షకుడిని బలి చేస్తారా నిర్మాత గారు?

Am Ratnam: మీరు కోట్లు కుమ్మరించారు కదా అని, ప్రేక్షకుడిని బలి చేస్తారా నిర్మాత గారు?

Am Ratnam: ప్రస్తుతం చాలామంది తెలుగు సినిమా నిర్మాతలు ఆడియన్స్ థియేటర్ కు రావడం మానేశారు. ఒకప్పుడులా సినిమాలు ఇప్పుడు ఆడడం లేదు. ఓటిటి వచ్చిన తర్వాత థియేటర్ కి వచ్చి సినిమా చూడాలి అనే ఆసక్తి ఎవరికి లేకుండా పోయింది అని చెబుతూ ఉంటారు. కేవలం ఆడియన్స్ థియేటర్ కి రాకపోవడానికి ఓటిటి మాత్రమే కారణం కాదు. చాలా కారణాలు ఉన్నాయి.


ఒకప్పుడు సినిమా అంటే చాలామందికి ఒక విముక్తి. ఎంటర్టైన్మెంట్ ఏమీ లేని రోజుల్లో సినిమా చూసి మూడు గంటల పాటు ఆడియన్ ఎంటర్టైన్ అయ్యేవారు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ షోస్ కూడా టీవీలో వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు సినిమా చూడటానికి థియేటర్ కి వెళ్లేవాళ్లు. కానీ ఇప్పుడు సినిమానే ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇంకా సినిమా చూడటానికి ఆసక్తి ఎవరు చూపిస్తారు.

టికెట్ రేట్లు 


చాలామంది నిర్మాతలు హీరో మార్కెట్ కూడా ఆలోచించకుండా ఒక కథను దర్శకుడి ఆలోచనను నమ్మి విపరీతంగా డబ్బులు పెడతారు. అది పెద్ద సాహసం అని చెప్పాలి. నిర్మాత కథ ఆల్రెడీ విన్నాడు కాబట్టి అంత సాహసం చేసి ఉండొచ్చు. కానీ ప్రేక్షకుడికి ఆ సినిమా ఎలా ఉంటుందో తెలియదు. అటువంటి తరుణంలో ఎక్కువగా డబ్బులు పెట్టి సినిమా చూడటానికి ఎవరు ఇష్టపడతారు.? ఈరోజు టిక్కెట్ రేట్లు చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఒక స్టార్ హీరో సినిమా విడుదల అయితే కానీ ఆడియన్స్ థియేటర్ కు వెళ్లలేని పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్ని షోస్ క్యాన్సిల్ అవుతూ వస్తున్నాయి.

హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో నిర్మాత ఎయం రత్నం మాట్లాడుతూ… కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు.. 100 రూపాయలకి టికెట్ ఎలా అమ్ముతాం.? సినిమా బడ్జెట్ కి తగ్గ టికెట్ రేట్ ఫిక్స్ చేయడంలో తప్పేమీ లేదు. ఎవరూ ఫోర్స్ చేయడం లేదు కదా థియేటర్లకి రండి అని. అందుకే హరిహర వీరమల్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్ కోసం అప్లై చేశాం.

ఒక విధంగా ఆయన మాట్లాడిన వెర్షన్ కరెక్ట్. కానీ మరోరకంగా అంత ఖర్చు పెట్టుకుని ప్రేక్షకుడు థియేటర్ కు వెళ్లినంత వరకు కూడా తెలియదు ఆ సినిమా ఫలితం ఎలా ఉంటుందని.? మీరు కోట్ల రూపాయలు సినిమా కోసం కుమ్మరించారు కదా అని చెప్పి ప్రేక్షకుడు ఎక్కువ డబ్బులు పెట్టి టికెట్ కొనలేడు. ఎందుకంటే కొన్ని రోజులు పోతే అదే సినిమా ఓటిటిలో కూడా విడుదలవుతుంది. అలాంటప్పుడు ఒక కుటుంబం రోజు జీవనం సాగించే డబ్బులను కేవలం ఒక సినిమా టికెట్ కోసం ఖర్చు పెడతాడా? అని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది.

పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి అలా సాగుతుంది 

కానీ కొంతమంది అభిమానులు మాత్రం హీరోలను విపరీతంగా ఇష్టపడతారు. హీరోలను తమ కుటుంబ సభ్యులలో కలిపేసుకుంటారు. అలాంటి వాళ్లు మాత్రం డబ్బులు గురించి ఆలోచించకుండా వెళ్లి సినిమా చూడటానికి ఇష్టపడతారు. అలాంటి వాళ్ళందరూ సినిమా చూసిన తరువాత పదిమందికి చెప్పడంతో ఆ సినిమాకి మంచి పేరు వస్తుంది. ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్లే అవకాశం కనిపిస్తుంది.

Also Read: Hari Hara Veeramallu: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్, సినిమా ఫలితం ముందే తెలిసిపోతుంది

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×