Mumbai Local Train: ముంబై లోకల్ ట్రైన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తారు. అంతేకాదు, రోజూ కొట్లాటలతో నేషనల్ లెవల్ లో హెడ్ లైన్స్ లో నిలుస్తుంది. లోకల్ ట్రైన్స్ లో జరిగే రకరకాల విన్యాసాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. ఇక తాజాగా ముంబై లోకల్ ట్రైన్ లో ఓ ఆశ్చర్యకర దృశ్యం కనిపించింది. ఓ వ్యక్తి ఏకంగా రైల్వే కోచ్ లోపల గొడుగు పెట్టుకుని కనిపించాడు. ఈ ఫోటోను ‘r/mumbai’ అనే యూజర్ రెడిట్ లో షేర్ చేశాడు. రద్దీగా ఉన్న AC కోచ్ ఓ వ్యక్తి హాయిగా గొడుగు పెట్టుకుని కనిపించాడు. “ప్రతిరోజూ ముంబై లోకల్ ట్రైన్ లో ఎన్నో వింతలు విశేషాలు చూస్తుంటారు కదా, ఇప్పుడు మీరు మరో విచిత్రమైన దృశ్యాన్ని చూడండి” అంటూ సదరు యూజర్ ఈ ఫోటోను షేర్ చేశాడు.
సోషల్ మీడియా ఫోటో వైరల్!
ఇక ఈ ఫోటో కాసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ప్రయాణీకుడు రైలు కోచ్ లోప గొడుగు ఎందుకు పెట్టుకుంటున్నాడో తెలియక ఆశ్చర్యపోయారు. “ఆ ట్యూబ్ లైట్లు వెలువడే UV కిరణాల నుండి తనను తాను రక్షించుకోవాలి కదా, అందుకే అతడు గొడుగు పెట్టుకున్నాడు” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “బహుశ అతడికి గొడుగు మూసేంద సమయం అతడికి దొరికి ఉండదు. అందుకే ఆయన ఓపెన్ చేసి అలాగే పెట్టుకున్నాడు” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.
Read Also: ఆ రూట్ లో వెళ్లే రైళ్లన్నీ రద్దు.. చెక్ చేసుకోండి లేకపోతే బుక్కైపోతారు!
గతంలోనూ పలు వీడియోలు వైరల్
ముంబై లోకల్ రైళ్లలో ఇలాంటి ఫోటోల, వీడియోలు వైరల్ కావడం ఇదే తొలిసారి కాదు. గత సంవత్సరం నవంబర్ లో, ఒక వ్యక్తి సొంత పోర్టబుల్ కుర్చీని రైల్లోకి తీసుకెళ్తున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది. ముంబై లోకల్ రైలులో సీటు దొరకడం అనేది చాలా కష్టం. ముఖ్యంగా రద్దీ సమయాల్లో కనీసం నిలబడ్డానికి చోటు ఉండదు. వైరల్ వీడియోలోని వ్యక్తి పోర్టబుల్ కుర్చీతో రైలు ఎక్కాడు. జాగ్రత్తగా తన బ్యాక్ ప్యాక్ తెరిచి ఒక చిన్న ప్లాస్టిక్ స్టూల్‌ను బయటకు తీశాడు. దానిని ఓపెన్ చేసి, అతను దానిపై కూర్చున్నాడు. తనకంటూ ఓ సొంత సీటును క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఈ తతంగాన్ని అంతా ఓ రైల్వే ప్రయాణీకుడు షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియోలో సదరు వ్యక్తి విక్టరీ సింబల్ కూడా చూపించడం బాగా వైరల్ అయ్యింది. సీట్లు దొరకని వారికి ఇదో బెస్ట్ ఆప్షన్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. విచిత్రమైన ఆలోచనకు తను కూడా గర్వంగా ఫీలవుతున్నట్లు ఈ వీడియోలో కనిపించింది.
Read Also: ఏపీ, తెలంగాణ మీదుగా వెళ్లే ఆ రైళ్లలో అదనపు కోచ్‌లు.. ఇక బెర్త్ కన్ఫార్మ్ పక్కా!