HBD Sanjay Dutt.. ప్రముఖ బాలీవుడ్ నటుడిగా పేరు సొంతం చేసుకున్న సంజయ్ దత్ (Sanjay Dutt) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నటుడిగా, నిర్మాతగా , కమెడియన్ గా, హోస్ట్ గా, ఆఖరికి రాజకీయ నేతగా కూడా పేరు సొంతం చేసుకున్నారు సంజయ్ దత్. రంగం ఏదైనా సరే ముద్ర వేయడంలో తన తర్వాతే ఎవరైనా అని నిరూపించారు. 1959 జూలై 29న ప్రముఖ బాలీవుడ్ నటులు సునీల్ దత్ (Sunil Dutt), నర్గీస్ దత్ (Nargis Dutt) దంపతులకు జన్మించారు. ఇకపోతే ఈరోజు సంజయ్ దత్ పుట్టినరోజు కావడంతో ఆయనకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఆయన అలవాట్లే తల్లి మరణానికి కారణం అయ్యాయా?
ఇకపోతే ప్రముఖ నటి నర్గీస్ దత్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంజయ్ దత్.. మొదటి సినిమా సమయంలోనే ఆమె చనిపోయారు. అంటే నర్గీస్ దత్ 1981లో తుది శ్వాస విడిచారు. ఆ సమయంలో సంజయ్ దత్ కి డ్రగ్స్ అలవాటు ఉంది అని, ఆ అలవాటు వల్లే ఆమె మానసిక క్షోభ అనుభవించి, చనిపోయారని అంటూ ఉంటారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ లేకపోవడం గమనార్హం.
సంజయ్ దత్ సినిమా ఎంట్రీ..
ఇకపోతే సంజయ్ దత్ 1971లో తన తండ్రి సునీల్ దత్ నటించిన ‘రేష్మ ఔర్ షేరా’ అనే చిత్రంలో గవాలి గాయకుని పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. 1981లో రాకీ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగుపెట్టారు.అలా ఏడాదికి రెండు, మూడు చిత్రాల చొప్పున వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంజయ్ దత్.. హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈయన నిర్మాతగా కూడా పనిచేసిన విషయం తెలిసిందే.
వివాదాల్లో ఇరుక్కున్న సంజయ్ దత్..
ఇకపోతే 1993 బొంబాయి బాంబు పేలుళ్ల ఘటనలో న్యాయస్థానం ఈయనకు దాదాపు 5 సంవత్సరాల పాటు కారాగార శిక్ష విధించింది. ఇక ఈ విషయం అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే.
సంజయ్ దత్ వ్యక్తిగత జీవితం..
1987లో నటి రిచాశర్మను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు త్రిషాలా అనే కూతురు కూడా జన్మించింది. సంసారం సాఫీగా సాగుతున్న సమయంలోనే రిచా శర్మ 1996లో బ్రెయిన్ ట్యూమర్ తో మరణించింది. తల్లి మరణం తర్వాత త్రిషాలా కి తన తండ్రి సంజయ్ దగ్గర కస్టడీ దొరకకపోవడంతో ఆమె తన అమ్మమ్మ , తాతయ్యలతో అమెరికాలోనే ఉంటున్నారు. ఇక 1998లో మోడల్ రియా పిళ్ళై ను రెండో వివాహం చేసుకున్నారు సంజయ్. 2005లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. రెండేళ్ల డేటింగ్ తర్వాత మళ్లీ 2008లో మాన్యతా దత్ ను గోవాలో మూడో వివాహం చేసుకున్నారు. ఇక 2010 అక్టోబర్ 21న వీరికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. అబ్బాయి షహ్రాన్, అమ్మాయి ఇక్రా.
ది రాజా సాబ్ నుండి సంజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్..
ఇదిలా ఉండగా ప్రస్తుతం సంజయ్ దత్.. మారుతి (Maruthi), ప్రభాస్ (Prabhas) కాంబినేషన్లో వస్తున్న ‘ది రాజా సాబ్ ‘ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో సినిమా నుండి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ALSO READ:Rajamouli: డేవిడ్ వార్నర్ కి జక్కన్న స్పెషల్ గిఫ్ట్.. ఎందుకు? ఏంటో తెలుసా?