Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 157 వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్స్ తో చేతులు కలుపుతూ సినిమాలు చేస్తున్నారు. అయితే యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా చిరంజీవికి స్వతహాగా అభిమానులు కావడం వలన మెగాస్టార్ తో బ్లాక్ బస్టర్లు ప్లాన్ చేస్తున్నారు.
పవర్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి తన పవర్ ఏంటో చూపించాడు బాబి. అయితే బాబీకి చెప్పుకోదగ్గ ప్రాపర్ హిట్ సినిమా లేదు అనుకున్న తరుణంలో వాల్తేరు వీరయ్య సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎలా చూడటానికి ఇష్టపడతారో అలానే చూపించి మంచి సక్సెస్ అందుకున్నాడు.
నయనతార చిరంజీవి పెళ్లి వీడియో లీక్
టైటిల్ చూసి కంగారు పడకండి అసలు జరిగిన విషయం ఏమిటంటే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కేరళాలో జరుగుతున్న విషయం తెలిసిందే. కొన్ని పడవల పైన ప్రయాణం చేస్తున్న చిత్ర యూనిట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Mega157 సినిమా నుంచి వీడియో లీక్ అయింది. లీకైన వీడియోలు నయనతార, మెగాస్టార్ చిరంజీవి పెళ్లి వస్త్రాల్లో కనిపిస్తున్నారు.
వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. దీనిని బట్టి అనిల్ ఏదో పెద్ద ప్లానే వేసి ఉంటాడు. మొత్తానికి కేరళ అందాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ బ్యూటీ కూడా సినిమాలో కనిపించనుంది. ఏదేమైనా ఈ లీక్ వీడియో చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు పెరిగాయి అనేది వాస్తవం. కానీ ఇలాంటి లీక్ వీడియోలు ముందు ముందు రాకుండా ఉండేటట్లు అనిల్ రావిపూడి మరియు చిత్ర యూనిట్ జాగ్రత్తపడవలసి ఉంది.
అంతా సోషల్ మీడియా ప్రభావం
కేవలం మెగాస్టార్ అనిల్ రావిపూడి సినిమాలకు మాత్రమే కాకుండా, చాలా సినిమాలు విషయంలో ఇది జరుగుతూనే ఉంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి రోజుకు ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే వీటన్నిటిని అరికట్టే విధంగా మేకర్స్ ప్లాన్ చేయాలి. లేదంటే రాజమౌళి లాగా ఫోన్ ఎవరు యూస్ చేయకూడదు అని ఒక రూల్ పెట్టాలి. అప్పటికి గానీ ఈ లీకులు అనేవి తగ్గవు.
Also Read : Andhra King Taluka : మాటలతో చెప్పలేనే, కుదురుగా ఉండలేనే.. రామ్ ఆమెతో అంతలా ప్రేమలో మునిగిపోయాడా.?