Hyderabad Floods: హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఈసారి ఎక్కవ ప్రభావం విమాన నగర్, పైగా కాలనీ మీద పడింది. అటుగా ఉన్న హోండా షోరూంలోకి భారీగా వరద నీరు చేరింది. ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. షోరూంలో పనిచేస్తున్న సుమారు 80 మంది కార్మికులు నీటిలో చిక్కుకుపోయారు.
షోరూంలో నీరు పొంగి పొర్లిపోతోంది!
ఉదయం నుంచే భారీ వర్షం కురుస్తోంది. ముందు చిన్నగా వచ్చిన నీరు, కొద్దిసేపటికే షోరూంలోకి ప్రవేశించింది. బయట చూసేలోపే నీటి మట్టం భారీగా పెరిగిపోయింది. అక్కడ పని చేస్తున్న స్టాఫ్ అంతా ఒక్కసారిగా గందరగోళానికి లోనయ్యారు. బయటకు వెళ్లే మార్గాలు అన్నీ నీటిలో మునిగిపోయాయి.
హైడ్రా టీమ్ రంగంలోకి..
వెంటనే షోరూమ్ సిబ్బంది పోలీసులకు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF), హైడ్రా టీంకు సమాచారం అందించారు. ఆలస్యం చేయకుండా పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అంచనా వేశారు. ముందుగా ఉన్నవారిని వెనుకవైపు షోరూంలోని తలుపుల ద్వారా బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.
బోట్లతో రెస్క్యూ.. సినిమా సన్నివేశంలా
కొందరిని బయటకు తీసుకురావడానికి బోట్లను ఉపయోగించారు. డీఆర్‌ఎఫ్ టీమ్ శ్రమించి ఒకరి తర్వాత మరొకరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీన్ని చూసిన ప్రజలు పోలీసులపై ప్రశంసలు కురిపించారు. వర్షం తగ్గిన తరువాత షోరూంలోని నీటిని బయటకు పంపే ప్రక్రియ ప్రారంభమైంది.
Also Read: Hyderabad Traffic Jam: హైదరాబాద్ లో వర్షం ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. కిలోమీటరుకు గంటల ప్రయాణం!
పరిస్థితి కలకలం – ప్రజలలో ఆందోళన
ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజల్లో ఆందోళన మొదలైంది. వర్షం తాళలేక ఆ ప్రాంతాలు మునిగిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పక్కనే ఉన్న ఇళ్లలోనూ కొంతవరకూ నీరు చేరినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ కూడా పూర్తిగా నిలిచిపోయింది. స్కూటర్లు, కార్లు నీటిలో మునిగిపోయాయి.
ఎక్కడికక్కడ వరదలు – పట్టణ పరిస్థితి దయనీయంగా
హైదరాబాద్ లో వర్షం కాస్త ఎక్కువ పడితే చాలు, డ్రైన్స్ బ్లాక్ అవుతాయి. రోడ్లు జలాశయంలా మారతాయి. పైగా కాలనీల్లో ఉన్న షోరూమ్స్, హౌసింగ్ ఏరియాస్ అన్నీ వరద నీటితో ఇబ్బంది పడుతున్నాయి. ఇది ఒక్కసారి కాదు, ప్రతి సారి ఇదే పరిస్థితి.
అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నగరంలో హైడ్రా టీం అప్రమత్తమైంది. పోలీసులు, హైడ్రా టీమ్ సత్వర స్పందన వల్లే ప్రమాదం లేకుండా ముగిసింది. కానీ ఈ ఘటన మరోసారి మనం ఎలాంటి నగరంలో జీవిస్తున్నామో గుర్తు చేసింది. ప్రతి వర్షంలోనే ఇలా జరిగితే.. రేపటి రోజుల్లో ఇంకెన్ని ప్రమాదాలు ఎదురవుతాయో అనిపిస్తోంది.