Andhra King Taluka : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది మల్టీ టాలెంటెడ్ హీరోలు ఉన్నారు. కిరణ్ అబ్బవరం వంటి హీరోలు తమ సినిమాలకు డైలాగులు కూడా రాస్తారు. సిద్దు జొన్నలగడ్డలో ఎంత మంచి రైటర్ ఉన్నాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తనలోని రైటర్ తనకు ఈరోజు ప్లస్ పాయింట్ అయ్యాడు. విశ్వక్సేన్ లో మంచి దర్శకుడు ఉన్నాడు. ఫలక్నామా దాస్ వంటి సినిమాతో దర్శకుడుగా కూడా మంచి సక్సెస్ అయ్యాడు.
అయితే తెలుగులో సాహిత్యం రాసే హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. పాటలైతే దాదాపు చాలామంది హీరోలు పాడారు కానీ లిరిక్స్ రాసిన వాళ్ళు తక్కువ. అయితే ఇప్పుడు రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కోసం రాసిన లిరిక్స్ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఒక పెద్ద లిరిక్ రైటర్ పాటను ఎలా రాస్తారు అచ్చం అలానే రాశాడు.
ఆమెతో ప్రేమలో ఉన్నాడా.?
రీసెంట్ టైమ్స్ లో చాలా వార్తలో వైరల్ గా మారాయి. హీరో, హీరోయిన్ కలిసి నటించిన సాధారణంగా జరిగే విషయమే. అయితే కొన్ని సందర్భాలలో వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ రకరకాలుగా బయటకు వినిపిస్తుంది. ఇక ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా విషయానికి వస్తే, రామ్ పోతినేని భాగ్యశ్రీ తో ప్రేమలో ఉన్నాడు అని కొన్ని వార్తలు వినిపించాయి. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది పక్కన పెట్టండి. అయితే ఇప్పుడు రామ్ పాటకు రాసిన లిరిక్స్ చూస్తుంటే నిజమేనేమో అనే సందేహం ఎక్కడో కలుగుతుంది. ఎందుకంటే ఎవరో బాగా కావలసిన అమ్మాయిని ఊహించుకొని ఈ ప్రేమ గురించి పాటను రాసినట్లు అనిపిస్తుంది.
మాటలతో చెప్పలేనే, కుదురుగా ఉండలేనే
ఈ పాటకి సంబంధించిన ప్రోమో విడుదలైనప్పుడే, ఐ లవ్ యు అని చెప్పకూడదు కానీ ప్రేమిస్తున్నాను అని తెలియాలి అనేలా ఉండాలి అని ఒక క్లిప్ రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు రామ్ దాదాపు తన సాహిత్యంలో దానినే రాసి చూపించాడు.
మాటలతో చెప్పమంటే చెప్పలేనే
భావమేదో భాషలకే అందనందే
అదేమిటో కుదురుగా ఉండలేనే… నువ్వుంటే..
అడిగితే అదేమిటో అర్థం కాదే
భావం భాష వంటి పదాలు ఈ పాటలో వింటుంటే సాహిత్యం పైన రామ్ కి ఎంత అవగాహన ఉందో అర్థం అవుతుంది. గతంలో కూడా రామజోగయ్య శాస్త్రి గారిని నేను మంచి పాట అడిగాను. అప్పుడు ఆయన ” తదుపరి జన్మ కంటే జాలి చూపే వీలుందంటే” అనే లైన్ రాశారు అంటూ పర్టికులర్ గా చెప్పాడు. దీనితో రామ్ సాహిత్యం మీద ఎంత అవగాహన ఉందో అర్థం అవుతుంది. అవగాహనతో పాటు, ప్రేమ అనే అనుభవం తోడు కావడం వలన ఇంత గొప్ప పాట రామ్ కలం నుంచి జాలువారి ఉండొచ్చు.
Also Read : Prashanth neel : కాంబినేషన్ లు వినడానికి బాగున్నాయి, కానీ అసలు క్లారిటీ ఇది