Tapsee Pannu : తాప్సి… ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఎన్నో సినిమాలు చేసినా కూడా మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమాతో మంచి గుర్తింపును సాధించుకుంది. దశరథ్ దర్శకత్వం వహించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ఈమె క్యారెక్టర్ ను అద్భుతంగా డిజైన్ చేశారు. ప్రభాస్ మైండ్ సెట్ కి సరిపోయే అమ్మాయిలా ఈ సినిమాలో కనిపించింది తాప్సి. అయితే తాప్సికి తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తున్న తరుణంలో, తాను చేసిన కొన్ని కామెంట్స్ వలన సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.
ఝుమ్మంది నాదం రెమ్యూనరేషన్ అంతే
మంచు మనోజ్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది తాప్సి. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఇంకొన్ని సినిమాలు చేసింది. అయితే ఒక తరుణంలో దర్శకులు రాఘవేంద్రరావు పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అక్కడితో తెలుగులో కూడా ఈమెకి ఆదరణ కొద్దిగా తగ్గింది అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాకి సంబంధించి తాప్సికి రెమ్యూనరేషన్ కేవలం ఐదు లక్షల రూపాయలు ఇచ్చారట. ఈ సినిమాను 30 నుంచి 40 రోజులు మధ్యలో పూర్తి చేశారు తెలిపారు తాప్సి.
తెలుగులో హిట్ సినిమాలు
చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన సాహసం సినిమాలో గోపీచంద్ తోపాటు కనిపించి ఆ సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత సంకల్ప రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఘాజి సినిమా కూడా మంచి పేరును తీసుకొచ్చింది. ఇకపోతే మహి వి రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఆనందోబ్రహ్మ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. కమర్షియల్ గా కూడా ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది.
Also Read : The Raja Saab : యుఎస్ లో ఈవెంట్ ప్లాన్ చేశారు, మరి తెలుగు ప్రేక్షకుల పరిస్థితి ఏంటి ప్రభాస్ గారు ?