Kingdom pre Release: సినీ నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా నటించిన కింగ్ డం (Kingdom)సినిమా జూలై 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు కేవలం రెండు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో నేడు హైదరాబాద్ లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక(Pre Release Event) జరుగుతుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమానికి డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దూరంగా ఉన్నారు. ఈయన సినిమా పనులలో ఉన్న నేపథ్యంలోనే రాలేకపోయారని విజయ్ దేవరకొండ తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ అభిమానులను(Fans) ఉద్దేశించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
మీరు దేవుడి వరం..
తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి తన పట్ల అభిమానులు చూపిస్తున్నటువంటి ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేని తెలిపారు. మీరు నాకు దేవుడిచ్చిన వరం అంటూ ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఇకపోతే గత కొంతకాలంగా తన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన నేపథ్యంలో అభిమానులు తన సినిమా సక్సెస్ కావాలని ఎలా కోరుకుంటున్నారో ఈ సందర్భంగా తెలిపారు. ఇటీవల తిరుపతిలో ట్రైలర్ విడుదల చేసిన తర్వాత ట్రైలర్ కు చాలా మంచి ఆదరణ లభించిందని తెలిపారు.
నన్ను మీ వాడిని చేసుకున్నారు…
ఈ ట్రైలర్ విడుదల చేసిన తర్వాత ఎంతోమంది అభిమానులు అన్న ఈసారి మనం హిట్ కొట్టిపోతున్నాం, మనం ఈసారి టాప్ లో కూర్చుంటున్నాం.. ఈసారి మనకు హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎవరూ కూడా నీకు అంటూ కామెంట్లు చేయలేదని, మనకు అంటూ కామెంట్లు చేస్తున్నారని ఇలా నన్ను మీవాడు అనుకోవడం వల్లే అలాంటి కామెంట్లు వస్తున్నాయి అంటూ ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు ఫిదా అవడమే కాకుండా ఎమోషనల్ అయ్యారు. ఇక నేడు ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ సినిమా కంటే కూడా అభిమానుల గురించే ఎక్కువగా మాట్లాడరు.
లోపల భయంగానే ఉంది…
ఇక ఈ సినిమా కోసం పనిచేసిన దర్శకుడు గౌతమ్ గురించి, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక హీరోయిన్ పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. అలాగే వెంకటేష్, సత్యదేవ్ గురించి కూడా ఎంతో గొప్పగా మాట్లాడారు. ఏది ఏమైనా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులలో కూడా ఏదో తెలియని ఆసక్తి నెలకొంది. ఇక విజయ్ దేవరకొండ కూడా మరొక రెండు రోజులలో ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో లోపల కాస్త భయంగా ఉందని కానీ పైకి మీరు చూపిస్తున్న అభిమానం ప్రేమ చూస్తుంటే చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది అంటూ మాట్లాడారు. మరి చాలా రోజుల నుంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.
Also Read: Pournami Re -release: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… రీ రిలీజ్ కి సిద్ధమైన పౌర్ణమి!