IND Vs ENG : టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ తో5 టెస్ట్ సిరీస్ లు ఆడుతోంది. ఇప్పటికే 4 టెస్టు మ్యాచ్ లు ఆడింది. అందులో టీమిండియా 1 విజయం సాధించగా.. ఇంగ్లాండ్ 2 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రా గా ముగిసింది. అయితే భారత బౌలర్లు బౌలింగ్ లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నారు. దీంతో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా జట్టులో కీలక మార్పులుంటాయని ఊహగానాలు వినిపిస్తున్నాయి. మాంచెస్టర్ టెస్ట్ డ్రాగా ముగిసినప్పటికీ.. కొంత మంది సభ్యులపై బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. అందులో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సహా ముగ్గురు వ్యక్తుల గురించి ప్రస్తావించడం విశేషం.
Also Read : T20 Records : 16 సిక్సర్లు, 44 ఫోర్లు.. 320 పరుగులు, అరుదైన రికార్డు
ఆ సిరీస్ తరువాతే..
ముఖ్యంగా ఇంగ్లాండ్ పర్యటన తరువాత బీసీసీఐ తక్షణ చర్యలు తీసుకోదని.. 2025 ఆసియా కప్ తరువాత వెస్టిండీస్ తో జరిగే టెస్ట్ సిరీస్ కి ముందు జట్టు కోచింగ్ సిబ్బంది పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఓ నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్కెల్, ఫీల్డింగ్ కోచ్ ర్యాన్ డెస్పాంప్స్ ఉన్నారు. బీసీపీఐ అంతర్గత చర్చల ప్రకారం.. మోర్నే మోర్కెల్ మార్గదర్శకత్వంలో భారత బౌలింగ్ అంత ప్రభావవంతంగా లేదు. అలాగే ర్యాన్ డెస్పాంప్స్ నాయకత్వంలో భారత జట్టు ఫీల్డింగ్ నాణ్యత క్షీణించిందని తేలింది. అందువల్ల వారిద్దరినీ వారి బాధ్యతల నుంచి తొలగించవచ్చు. ప్రధానంగా వీరిద్దరినీ గౌతమ్ గంభీర్ సిఫారుసుపై నియమించారు. గంభీర్ కి ప్రధాన కోచ్ గా మరికొంత సమయం ఇవ్వాలని బీసీసీఐ పరిశీలిస్తోందని కూడా చెబుతున్నారు.
సెలక్షన్ కమిటీ పై చర్యలు
సహాయక సిబ్బంది పైనే కాకుండా.. సెలక్షన్ కమిటీ సభ్యుల పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా చీఫ్ సెలక్టర్లు అజిత్ అగార్కర్, శివసుందర్ దాస్ లను కూడా బీసీసీఐ పరిశీలిస్తోంది. ఇంగ్లాండ్ పర్యటనలో వారి పేలవ ప్రదర్శన వారి కొన్ని ఎంపిక నిర్ణయాలపై విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. భారత జట్టు ప్రస్తుతం పరివర్తన దశలో ఉంది. జట్టు ప్రదర్శన, సంస్త, నాయకత్వం గురించి జాగ్రత్తగా పరిశీలించిన తరువాత రాబోయే రోజుల్లో బీసీసీఐ కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఆసియా కప్ తరువాత ఈ మార్పులు క్రికెట్ లో భవిష్యత్ పై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. టీమిండియా బ్యాటర్లు.. బౌలర్లు ప్రస్తుతం ఎప్పుడూ రాణిస్తున్నారో.. ఎప్పుడు రాణించరో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్, మూడో టెస్ట్ మ్యాచ్ లో రాణించారు. మూడో టెస్ట్ మ్యాచ్ ని చేజేతురాల కోల్పోయారు. తక్కువ స్కోర్ ని కూడా ఛేజ్ చేయలేకపోయారు. ఆ దెబ్బతో ఇప్పుడు టీమిండియా సిరీస్ కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నది. ఇంకా ముందు ముందు ఇలాంటి సంఘటనలు ఇలాగే రిపీట్ అయితే బీసీసీఐ సంచలన నిర్ణయం కచ్చితంగా తీసుకునే అవకాశం లేకపోలేదు.