BigTV English

Pournami Re -release: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… రీ రిలీజ్ కి సిద్ధమైన పౌర్ణమి!

Pournami Re -release: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… రీ రిలీజ్ కి సిద్ధమైన పౌర్ణమి!

Pournami re release: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న నటుడు ప్రభాస్ (Prabhas) ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఈయన నటించి బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలలో పౌర్ణమి సినిమా(Pournami) కూడా ఒకటి. ప్రభాస్, త్రిష (Trisha)చార్మి(Charmi) హీరో హీరోయిన్లగా తెరకెక్కి 2006లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా (Prabhudeva) దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. రొమాంటిక్ మ్యూజికల్ యాక్షన్స్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేయటానికి సిద్ధమవుతోంది.


రొమాంటిక్ మ్యూజికల్ యాక్షన్..

ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రతినెల ఎన్నో సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఇక ఈ సినిమా కూడా సెప్టెంబర్ 19వ తేదీ తిరిగి విడుదల కాబోతుందని తెలుస్తుంది. తాజాగా ఈ విషయం గురించి చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు. ఇలా మరోసారి ప్రభాస్ రొమాంటిక్ మ్యూజికల్ యాక్షన్ థియేటర్లలో రాబోతుందనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ది రాజా సాబ్ తో రాబోతున్న ప్రభాస్…

గత ఏడాది ప్రభాస్ కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఈ ఏడాది ఇప్పటివరకు ఏ ఒక్క సినిమాని కూడా విడుదల చేయలేదు అయితే ఈయన నటించిన ది రాజా సాబ్(The Raja Saab) సినిమా ఈ ఏడాది డిసెంబర్ ఐదో తేదీ ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇలాంటి తరుణంలోనే ఈ సినిమా కంటే ముందుగానే అభిమానుల కోసం పౌర్ణమి సినిమా తిరిగి విడుదల కాబోతుందని విషయం తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభాస్ మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమాలో రుద్ర పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ఈ సినిమాలో నటించిన నేపథ్యంలో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయని చెప్పాలి.

పాన్ ఇండియా సినిమాలతో బిజీగా..

ఇలా ప్రభాస్ అభిమానులను ఏమాత్రం నిరాశపరచకుండా ఇలా సినిమాలలో క్యామియో పాత్రలలో నటిస్తూ, అలాగే రీ రిలీజ్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలోనే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా షూటింగ్ పనులలో కూడా భాగం కాబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాతో పాటు కల్కి 2, సలార్ 2 సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Also Read: Coolie Trailer: రజనీకాంత్ కూలీ ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్..ఎప్పుడంటే?

Related News

Big Breaking: సీనియర్ హీరోయిన్ రాధికా తల్లి మృతి!

Rithu Chowdhary: హీరో బెడ్ రూంలో రీతు చౌదరి.. వీడియోతో బట్టబయలైన ఎఫైర్

OG Trailer: ఓజీ ట్రైలర్ రిలీజ్.. హీరో కంటే ఆయనకే ఎక్కువ హైప్ ఇచ్చినట్టున్నారే?

Pawan Kalyan: అప్పట్లో ఇలాంటి టీమ్ ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవాన్ని కాదు!

OG Concert: పవన్ కళ్యాణ్ కు ఏది ఊరికే రాదు… మనల్ని ఆపేది ఎవరు..జోష్ నింపిన పవన్!

Pawan Kalyan: సుజీత్ కు పిచ్చి పట్టుకుంది, పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వడానికి అదే కారణం

OG concert: ఓజీ రివ్యూ ఇదే..మీసం మెలేసిన తమన్…అంత కాన్ఫిడెంట్ ఏంటీ భయ్యా!

OG Movie : చంపేస్తే చంపేయండి రా… ఇలా మెంటల్ టార్చర్ పెట్టకండి, ఓజి సినిమా చిక్కులు

Big Stories

×