Vijay Devarakonda : ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించిన విజయ్ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించి మంచి గుర్తింపు సాధించుకున్నాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విజయ్.
సురేష్ బాబు రిలీజ్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. మొదటి సినిమాతోనే ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అయిపోయాడు. చాలామంది ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా తర్వాత విజయ్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ప్రస్తుతం సందీప్ ఏ రేంజ్ లో ఉన్నాడో ప్రత్యేకించి గుర్తు చేయాల్సిన అవసరం లేదు.
అలా పిలవద్దు
విజయ్ దేవరకొండ విషయానికి వస్తే అర్జున్ రెడ్డి టైంలో తను ఇచ్చే స్పీచెస్ చాలా వైరల్ గా మారేవి. అలానే కొన్ని ఇంటర్వ్యూస్ లో మాట్లాడే విధానం కూడా చాలామందిని విపరీతంగా ఆకట్టుకునేది. అయితే ఎక్కువ శాతం మందికి ఇది ఇంకోలా అర్థమయ్యేది. యాటిట్యూడ్ చూపిస్తున్నాడు సక్సెస్ తలకెక్కింది అని అందరూ కామెంట్ చేశారు. కొన్ని సందర్భాల్లో విజయ్ మాట్లాడే విధానాన్ని బట్టి తన క్యారెక్టర్ జడ్జ్ చేశారు. ఒక సందర్భంలో ఒక సినిమా పోస్టర్ పై ది విజయ్ దేవరకొండ అని వేశారు. అయితే చాలామందికి ఇది అబ్జెక్షన్ గా అనిపించింది. అప్పట్లో అనసూయ కూడా ఈ విషయం పైన కామెంట్ చేశారు. ఇప్పుడు కింగ్డమ్ సినిమా ఈవెంట్లో భాగ్యశ్రీ మాట్లాడుతూ ది విజయ్ దేవరకొండ అన్నప్పుడు. విజయ్ ఏమీ మాట్లాడకుండా అలా వద్దు అన్నట్లు తల ఊపారు. ఈ విజువల్ చూస్తుంటే విజయ్ లో చాలా మార్పు వచ్చింది అని అర్థమవుతుంది.
ఈ సినిమాతోనే కం బ్యాక్
విజయ్ దేవరకొండ కెరియర్ లో ఒక సక్సెస్ఫుల్ సినిమా వచ్చి చాలా ఏళ్లు అవుతుంది. ఎన్నో అంచనాలతో చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ అందుకోలేకపోతున్నాయి. అయితే జులై 31న ప్రేక్షకులు ముందుకు రానున్న కింగ్డమ్ సినిమా విజయ్ కెరీర్ కు మంచి కం బ్యాక్ అవుతుంది అని అందరు ఊహిస్తున్నారు. ఈ సినిమా గురించి నిర్మాత నాగ వంశీ కూడా పలు సందర్భాల్లో మాట్లాడుతూ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అని తెలిపారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో జులై 31న అర్థమవుతుంది.
Also Read: Bhagyashri Borse : ఆ హీరోయిన్ నాకు బాగా నచ్చి పెట్టుకున్నా, నిర్మాత షాకింగ్ కామెంట్స్