Bhagyashri Borse : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలబడటం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. కొన్నిసార్లు మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న కూడా సరైన అవకాశాలు రావు. అలా మొదటి సినిమాతో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. రామ్ చరణ్ తో చిరుత సినిమాలో కనిపించిన నేహా శెట్టి ఆ తర్వాత పెద్దగా గుర్తింపు ఉన్న సినిమాలు చేయలేకపోయింది.
ఇక అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శాలిని పాండే తను కూడా ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది. ఉప్పెన సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ఎక్కువ సినిమాలు చేసినా కూడా ఆ సినిమా తర్వాత సరైన గుర్తింపు ఒక సినిమా కూడా తీసుకురాలేదు. ఇక ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్న పేరు భాగ్యశ్రీ బోర్షే.
నాకు నచ్చి హీరోయిన్ ను పెట్టుకున్న
మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్షే. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. కానీ ఈ సినిమా పాటలు మంచి హిట్ అయ్యాయి. దీంతో సినిమా రిలీజ్ కాకముందే భాగ్యశ్రీ కి వరుస అవకాశాలు వచ్చాయి. విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాలో కూడా భాగ్యశ్రీ నటించింది. కింగ్డమ్ సినిమా గురించి నిర్మాత నాగ వంశీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతున్న తరుణంలో, యాంకర్ సుమ మీరే హీరో అయితే హీరోయిన్ గా ఎవరిని పెట్టుకుంటారు అని అడిగినప్పుడు. నేను నాకు నచ్చే హీరోయిన్ ని పెట్టుకున్నాను గౌతమ్ ని గాని విజయ్ గాని అడగలేదు అని నాగ వంశీ తెలిపారు.
ఈ సినిమాతో సక్సెస్ రావాలి
భాగ్యశ్రీ ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటుంది అని చాలామంది ఊహిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో కూడా భాగ్యశ్రీ నటిస్తుంది. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్గా విడుదలైన పాట మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ పాటను అనిరుద్ రవిచంద్రన్ పాడారు. రామ్ పోతినేని మొదటిసారి ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న సాహిత్య రచయితలకు ఏమాత్రం తగ్గకుండా ఈ పాటను రాశారు రామ్.
Also Read : Kingdom: ఈవెంట్లోనే కాదు సినిమాలో కూడా కాపీ డైలాగులు