King Dom Film: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కింగ్ డం(King Dom) మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే విజయ్ దేవరకొండ ఇప్పటివరకు పలు సినిమాలలో నటించిన ఈయనకు అర్జున్ రెడ్డి, గీతగోవిందం తర్వాత ఈ స్థాయిలో సక్సెస్ మాత్రం ఇప్పటివరకు రాలేదని చెప్పాలి. ఇలా సరైన సక్సెస్ కోసం ఎంతో కష్టపడుతున్న విజయ్ దేవరకొండ ఎన్నో అంచనాల నడుమ కింగ్ డమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జులై 31వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతంగా నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో హీరోలు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను చేస్తూ భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న సంగతి తెలిసిందే.
భారీ మొత్తంలో రెమ్యూనరేషన్లు…
ఈ క్రమంలోనే కింగ్ డం సినిమా కోసం నటుడు విజయ్ దేవరకొండ ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ (Remuneration)తీసుకున్నారనే విషయంపై ఆసక్తి నెలకొంది. అదేవిధంగా ఈ సినిమాలో నటించిన సత్యదేవ్, భాగ్యశ్రీ(Bhagya Shri) వంటివారికి కూడా ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చారనే విషయాలపై ఓ వార్త వైరల్ అవుతుంది. కింగ్ డం సినిమా కోసం నటుడు విజయ్ దేవరకొండ సుమారు 30 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. అదేవిధంగా నటి భాగ్యశ్రీ ఈ సినిమా కోసం రూ. 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంద.
నాగ వంశీ నిర్మాణ సారథ్యంలో…
ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అన్నయ్య పాత్రలు నటుడు సత్యదేవ్(Satya Dev) నటించిన విషయం తెలిసిందే. ఇలా సత్యదేవ్ రూ.3 కోట్ల రూపాయలు, ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించిన గౌతం తిన్ననూరి రూ.7 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇలా సంగీత దర్శకుడిగా పని చేసినందుకు ఈయన కూడా రూ. 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం. ఇక ఈ సినిమా సుమారు 130 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ అయిందని తెలియజేశారు. ఈ సినిమాని సాయి సౌజన్య నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
స్పై యాక్షన్ డ్రామాగా…
ఇక ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ బారీ ధరలకు కైవసం చేసుకున్నారు. ఇక ఈ సినిమా స్పై యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో సూరీ అనే కానిస్టేబుల్ పాత్రలో నటించే విజయ్ దేవరకొండ కొన్ని పరిస్థితుల కారణంగా ఒక అండర్ కవర్ ఆపరేషన్ లో భాగమవుతారు అయితే ఈ ఆపరేషన్ లో భాగంగా ఈయన తన పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఏకంగా మాఫియాలో చేరబోతున్నారని ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ చూస్తేనే స్పష్టం అవుతుంది. మొత్తానికి ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే మాత్రం సినిమా పై మంచి అంచనాలని పెంచేసింది. మరి 31 తారీకు రాబోయే ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో తెలియాల్సి ఉంది.
Also Read: King Dom: కింగ్ డం క్యామియో పాత్రలో ఆ స్టార్ హీరో…ఈ ట్విస్ట్ ఏంటీ బాసు?